శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Jul 18, 2020 , 02:25:13

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

  • జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు

గీసుగొండ, జూలై 17 : గ్రామాల అభివృద్ధికి మండల పంచాయతీ  అధికారులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు సూచించారు. మండలంలోని గంగదేవిపల్లిలో శుక్రవారం పంచాయతీ అధికారులతో సమీక్ష ని ర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్మశాన వాటిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. వారంలో రెండు రోజులు గ్రామాల తనిఖీ చేయాలన్నారు. కార్యదర్శులు గ్రామాల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావా లన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీలో స్వరూప, ఎంపీడీవో రమేశ్‌, ఎంపీవోలు పాల్గొన్నారు.logo