శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Jul 18, 2020 , 02:19:44

ఫర్టిలైజర్‌ షాపుల దోపిడీని అరికట్టాలి

ఫర్టిలైజర్‌ షాపుల దోపిడీని అరికట్టాలి

నర్సంపేట : రైతులను నిలువునా దోపిడీ చేస్తున్న ఫర్టిలైజర్‌ షాపులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వరంగల్‌ రూరల్‌, అర్బన్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ కార్యదర్శి కోడి సోమన్న డిమాండ్‌ చేశారు. శుక్రవారం నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ.. సొసైటీలో యూరియా బస్తాను రూ.270 తీసుకుని దళారులు గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన, ఆదివాసీ గూడేల్లో రూ.350కి విక్రయిస్తున్నారని ఆరోపించారు.  ప్రభుత్వం ప్రకటించిన రేట్లకే రైతులకు విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మాడ అశోక్‌, అడ్డూరి రాజు, నారాయణ, లవకుమార్‌, రాజు, లింగయ్య, మనోహర్‌, రాజు, రంజిత్‌ పాల్గొన్నారు.logo