ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Jul 17, 2020 , 00:01:16

కాకతీయ కాల్వలో కాళేశ్వర జలాలు

కాకతీయ కాల్వలో కాళేశ్వర జలాలు

  •  వరంగల్‌కు చేరిన గోదావరి నీరు
  • ఎల్‌ఎండీ నుంచి విడుదల
  • స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరిధిలో 10,672 చెరువులు నింపేలా ప్రణాళిక 

భీమారం: కరీంనగర్‌లోని లోయర్‌ మానేరు డ్యామ్‌(ఎల్‌ఎండీ) నుంచి గోదావరి జలాలను విడుదల చేశారు. కాకతీయ కాల్వ ద్వారా గురువారం ఉదయం వరంగల్‌కు చేరుకున్నాయి. ఎల్‌ఎండీ నుంచి 5 వేల క్యూసెక్కుల నీటిని వానకాలం పంటలకు అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందు సమీక్షించినట్లే ఈనెల 15వ తేదీన ఎల్‌ఎండీ నుంచి నీటిని విడుదల చేసింది. ఎస్సారెస్పీ స్టేజ్‌-2 నల్లగొండ జిల్లాలోని చివర ఆయకట్టు వరకూ సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుగానే ఎల్‌ఎండీ నుంచి సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సారెస్పీ స్టేజ్‌-1, స్టేజ్‌-2 చివరి ఆయకట్టు వరకు ఉన్న 10,672 చెరువులను నింపేలా అధికారులు ప్రణాళిక తయారు చేశారు. ఈ మేరకు ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని తెలంగాణ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్‌ఎండీ నుంచి కాకతీయ కాలువ ద్వారా టెయిల్‌ టు హెడ్‌ వరకు 9 లక్షల ఎకరాలకు సాగనీరు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. గోదావరి జలాలను గతేడాది మాదిరిగానే ఎస్సారెస్పీ స్టేజ్‌-1, స్టేజ్‌-2 ఆయకట్టు వరకూ ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుగా నీటిని విడుదల చేసినట్లు ఎస్సారెస్పీ ఎస్‌ఈ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.