అక్రమార్కుల్లో కలకలం!

- అక్రమంగా మట్టి తవ్వకాలపై సీరియస్
- విచారణకు ఆదేశించిన కలెక్టర్ హరిత
- ‘నమస్తేతెలంగాణ’ కథనానికి స్పందన
వరంగల్‌రూరల్, నమస్తేతెలంగాణ: వంచనగిరి గ్రామ శివారులోని అసైన్డ్ భూమల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మట్టి మాఫియాపై బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచు రితమైన ‘తోడేస్తున్నారు!’ కథనం అక్రమార్కుల్లో కలకలం సృష్టించింది. దీనిపై వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం హరి త విచారణకు ఆదేశించారు. ఈ మేరకు గీసుగొండ తహసీ ల్దార్ సుహాసిని ఆమెకు సమగ్ర నివేదిక సమర్పించారు. మట్టి దందాపై ఆర్డీవో మహేందర్ జీ విచారణ జరుపుతున్నారు. నేడో రేపో గనుల శాఖ అధికారులతో కలిసి తాను వంచ నగిరి గ్రామాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు.
తవ్వకాలను పరిశీలించిన ఆర్ఐ
వరంగల్ రూరల్ ఆర్డీవో మహేందర్‌జీ ఆదేశాలతో గీసు గొండ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) అర్జున్, వీఆర్వో సమ్మయ్యతో అసైన్డ్ భూములను పరిశీలించారు. ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం కావడంతో బుధవారం మట్టి తవ్వకాలు నిలిచిపోయాయి. ఇక్కడి నుంచి జేసీబీలు, లారీలను ఇతర ప్రాంతాలకు తరలించారు. వరంగల్‌లోని లేబర్ కాలనీ, దూపకుంటకు చెందిన వ్యక్తులు అసైన్డ్‌దారుల నుంచి భూమి కొని అక్రమంగా మట్టి తోడుతూ లారీల ద్వారా వరంగల్ నగరానికి తరలిస్తున్నారని ఇప్పటికే తమ నెట్ వర్క్ ద్వారా సమాచారం సేకరించినట్లు తెలిసింది.
తాజావార్తలు
- ఉర్దూ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
- ర్యాలీలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
- డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
- భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు
- బుద్ధిలేనోడే ఆ ఆల్‌రౌండర్‌కు రూ.10కోట్లు చెల్లిస్తారు!
- రైతుల హింసాత్మక ర్యాలీపై హోంశాఖ అత్యవసర సమావేశం
- అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
- యువతిపై గ్యాంగ్ రేప్..
- అమెరికా తొలి మహిళా ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్!
- ‘కిసాన్ ర్యాలీలో అసాంఘిక శక్తులు’