ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకే సమాంతర బ్రిడ్జి

- నాణ్యంగా, వేగవంతంగా పనులు
- పట్టణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
కాజీపేట: ఫాతిమానగర్‌లో నిర్మిస్తున్న సమాంతర బ్రిడ్జితో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. సోమవారం ఆయన బ్రిడ్జి నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు జరుగుతున్న తీరు ను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన వరంగల్ మహానగరానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేట పట్టణం సీమాంధ్రుల పాలనలో అన్ని విధాలా నిర్లక్ష్యానికి గురైందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపడంతో పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. కాజీపేటలో 40 ఏళ్ల క్రితం అప్పటి జనాభా, వాహనాలకు అనువుగా నిర్మాణం చేసిన ఫాతిమా బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావ్యవస్థకు చేరడంతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. నగరాలు, పట్టణాల్లో పుట్ ఓవర్ బ్రిడ్జిలను నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్) నిర్మిస్తుందన్నారు.
కానీ, కాజీపేట పట్టణంలో ప్రజల ట్రాఫిక్ కష్టాలు చూసి చలించిన సీఎం కేసీఆర్ ఫాతిమాబ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేలా 2018లో ఆదేశాలు ఇవ్వడంతోపాటు ప్రత్యేకంగా 539 జీవోను జారీ చేసి, రూ. 78 కోట్ల నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో కొంత స్థలం రైల్వేకు సంబంధించింది కావడంతో రైల్వేశాఖ నుంచి క్లియరెన్స్ రావడంలో జాప్యం జరిగిందన్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని నూతన టెక్నాలజీతో చేపట్టినట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఏకకాలంలో మూడు వరుసల్లో వాహనాలు సులువుగా వెళ్లవచ్చన్నారు. దాస్యం వెంట టీఆర్ఎస్ నాయకులు మాడిశెట్టి శివశంకర్, మహ్మద్ సోనీ, ఆర్అండ్బీ ఎస్ఈ నాగేందర్రావు, ఈఈ ఎల్ రాజాం, డీఈ మనోహర్ ఉన్నారు.
తాజావార్తలు
- ముందే కరోనా కట్టడిలో చైనా ఫెయిల్!
- కుల్సుంపురాలో బాలిక అదృశ్యం
- మధ్యప్రదేశ్‌లో ‘తాండవ్’పై బ్యాన్ విధిస్తాం
- బంగారు కమ్మలు కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
- ఎములాడలో దంతెవాడ ఎమ్మెల్యే పూజలు
- శ్రీలంక జలాల్లో మునిగిన భారత ఫిషింగ్ బోట్
- హెచ్-1బీ కోసం ఓపీటీ దుర్వినియోగం: దర్యాప్తుకు అమెరికా సిద్ధం!
- ’అల్లుడు అదుర్స్’ కలెక్షన్లలో వెనకబడిందా..?
- భద్రాద్రి కొత్తగూడెంలో తొలిసారిగా బాలల అదాలత్
- ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి