గురువారం 13 ఆగస్టు 2020
Warangal-rural - Jul 13, 2020 , 01:23:45

వందేళ్లలో ఇలాంటి పరిస్థితులు రాలేదు

వందేళ్లలో ఇలాంటి పరిస్థితులు రాలేదు

  • కళాశాలల విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌


నర్సంపేట, జూలై 12: వందేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు రాలేదని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ అన్నారు. నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఆన్‌లైన్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ఆదివారం ‘సైస్టెనబిలిటీ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌ ఇన్‌ద కంటెక్ట్స్‌ ఆఫ్‌ కొవిడ్‌-19 చాలెంజెస్‌ అండ్‌ పర్‌ఫెక్టివ్స్‌' కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్‌ ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. కొవిడ్‌-19 విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిందన్నారు. విద్యా వ్యవస్థలో ఒక దశాబ్ద కాలంలో రావాల్సిన మార్పులు కొన్ని నెలల్లోనే వచ్చాయన్నారు. ఆన్‌లైన్‌ విద్యా విధానం, అధ్యాపకులు, విద్యార్థులు టెక్నాలజీని వినియోగించడంలో మెలకువలు నేర్చుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టి జిజ్ఞాస కార్యక్రమం విద్యార్థులకు వరంగా పని చేస్తున్నదన్నారు. ఇందులో కళాశాల, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి మంచి ప్రాజెక్టులను ఎంపిక చేసి బహుమతులు ఇస్తామన్నారు. రాబోయే రోజుల్లో పిల్లలకు తరగతి గదిలో చెప్పే విద్యను ఆన్‌లైన్‌లో బోధించాల్సి వస్తుందన్నారు.

దీన్ని హైబ్రిడ్‌ విధానం అంటారన్నారు. అధ్యాపకులు నూతన విద్యా పోకడలను నేర్చుకుని ఆధునిక విధానాలకు అనుకూలంగా మారాలని సూచించారు. రిసోర్స్‌ పర్సన్‌గా వచ్చిన జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విజయభాస్కర్‌ మాట్లాడుతూ అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలను వీడియో, ఆడియోలుగా రికార్డు చేసుకోవాలన్నారు. కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పురుషోత్తం మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీకి 342 ప్రభుత్వ, 300 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయన్నారు. ప్రపంచస్థాయి టాప్‌ 500 విద్యాసంస్థల్లో మన దేశం నుంచి ఆరు సంస్థలు మాత్రమే ఉండడం దారుణమన్నారు. మన విద్యా సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ పీ బాలభాస్కర్‌, డాక్టర్‌ శ్రీనాథ్‌, తోట రమేశ్‌, డాక్టర్‌ విష్ణుకుమార్‌, నరేందర్‌, డాక్టర్‌ లకన్‌సింగ్‌, డాక్టర్‌ సుమతి, శ్రీనివాస్‌, త్యాగయ్య, రాజీరు, సమ్మయ్య, రమేశ్‌, డాక్టర్‌ కుమారస్వామి, ప్రసూన, పూర్ణచందర్‌ పాల్గొన్నారు.


logo