Warangal-rural
- Jul 12, 2020 , 06:47:20
పల్లెల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ : అరూరి

న్యూశాయంపేట/హసన్‌పర్తి: పల్లెల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమని భావించి సీఎం కేసీఆర్ పల్లెప్రగతికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. శనివారం ఆయన హన్మకొండ హంటర్‌రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో హసన్‌పర్తి మండల ప్రజాప్రతినిధులు, అధికారులతో హరితహారం, పల్లెప్రగతి, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఈజీఎస్, విద్యుత్ అంశాలపై సమీక్షించారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో మంకీ ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఎంపీడీవో కక్కెర్ల వీరేశ్‌గౌడ్, ఎంపీవో కట్ట కరుణాకర్‌రెడ్డి, ఏపీవో విజయలక్ష్మి, ఎంఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆస్కార్ రేస్‌లో విద్యాబాలన్ సినిమా నట్‌ఖట్
- శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఆల్ట్రా 5G బుకింగ్స్ ప్రారంభం
- సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- తెలంగాణ-గుజరాత్ల మధ్య అవగాహన ఒప్పందం
- పట్టని నిబంధనలు.. టీకాలు వేయించుకున్న ఎమ్మెల్యేలు
- ఐస్‌క్రీంకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందోచ్!
- యూట్యూబ్‌లో ఆకట్టుకుంటున్న ‘అలా సింగపురం’లో..
- అల్లు అర్జున్ బాటలో శిరీష్
- జంపన్న వాగులో ఈతకెళ్లి ఇద్దరు పిల్లలు మృతి
- వ్యాక్సిన్ రావడం శుభసూచకం : మంత్రి సత్యవతి రాథోడ్
MOST READ
TRENDING