పాకాలకు పూర్వవైభవం తీసుకొస్తాం

- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
- కలెక్టర్‌తో కలిసి మూడు కిలో మీటర్ల పర్యటన
ఖానాపురం, జూలై 11: ఒకప్పుడు దట్టంగా ఉండి అనేక రకాల వన్యప్రాణులకు నిలయమైన చారిత్రక పాకాల అడవులకు పూర్వ వైభవం తీసుకొస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా శనివారం రూరల్ కలెక్టర్ హరిత, సీసీఎఫ్ అక్బర్‌తో కలిసి ఎమ్మెల్యే పాకాల కట్టపై మొక్కలు నాటారు. అనంతరం పాకాల మత్తడి ప్రాంతం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల కోసం నిర్మించిన పర్కులేషన్ ట్యాంకును కలెక్టర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పెద్ది కాలినడకన వెళ్లి పరిశీలించారు. పాకాలలో ఉన్న మోదుగు ఆకులతో ఇస్తారాకులు తయారు చేయించి ఇక్కడే విక్రయించేలా ఏర్పాటు చేయాలని అటవీ అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు పాకాల హెర్బల్ టీ రుచి చూశారు. కార్యక్రమంలో సీసీఎఫ్ అక్బర్, డీఎఫ్‌వో అర్పన, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఏడీఏ తోట శ్రీనివాసరావు, తహసీల్దార్ సుభాషిణి, ఏసీపీ ఫణీంద్ర, సీఐ సతీశ్‌బాబు, ఎఫ్ఆర్వో రమేశ్, డీఆర్వో ఇజాజ్, వైస్ ఎంపీపీ ఉమారాణి, సర్పంచ్ కవి, రవి, ఉపేందర్‌రెడ్డి, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
రైతుల సమగ్ర అభివృద్ధికే వేదికలు : కలెక్టర్
రైతుల సమగ్ర అభివృద్ధికే ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపడుతున్నదని కలెక్టర్ హరిత అన్నారు. అశోక్‌నగర్‌లో రైతు వేదిక నిర్మాణానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ హరిత శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ కుంచారపు వెంకటరెడ్డి, ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఏవో శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఉమారాణి, సర్పంచ్ కవిత, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ గంగాధర రమేశ్, వేజళ్ల కిషన్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, దేవేందర్‌రావు, బండి వెంకన్న, తిరుపతిరెడ్డి, ముద్దంగుల రవి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- షిరిడీకి వెళ్దామని చెప్పి.. స్వామీజీ కిడ్నాప్
- చైనా ఉపసంహరిస్తేనే.. మన దళాలను తగ్గిస్తాం : రాజ్‌నాథ్
- నెటిజన్స్ ట్రోల్ చేయడంతో పోస్ట్ డిలీట్ చేసిన సమంత
- నిలకడగా శశికళ ఆరోగ్యం
- ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- ఆచార్యలో చరణ్ సరసన ఈ బ్యూటీని ఫైనల్ చేశారా..!
- నేటి నుంచి తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు