ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Jul 11, 2020 , 01:20:20

కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : పెద్ది

కరోనాపై ప్రజలు  అప్రమత్తంగా ఉండాలి : పెద్ది

నర్సంపేట, జూలై 10: కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. శుక్రవారం పట్టణంలోని డీఎంహెచ్‌వో మధుసూదన్‌, మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పెద్ది సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని గ్రామాలు, పట్టణంలోనూ పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు.

ప్రజలు అశ్రద్ధగా ఉండడం సరికాదన్నారు. కొంతమంది మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజనల్‌ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్వారంటైన్‌ను సక్రమంగా అమలు చేయాలన్నారు. వైద్యాధికారులు, పోలీసులు, మున్సిపల్‌ అధికారులు అశ్రద్ధ చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజనీకిషన్‌, వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ విద్యాధర్‌ పాల్గొన్నారు.