శుక్రవారం 07 ఆగస్టు 2020
Warangal-rural - Jul 11, 2020 , 01:13:47

రైతులకు అందుబాటులో వేదికలు

రైతులకు అందుబాటులో వేదికలు

  • ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్‌ హరిత

ఆత్మకూరు, జూలై 10: రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామాల్లోనే రైతు వేదికలకు భవనాలు నిర్మిస్తున్నట్లు వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రూరల్‌ కలెక్టర్‌ హరిత అన్నారు. శుక్రవారం రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురంలో రూ. 22 లక్షలతో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యే హరితహారంలో మొక్కలు నాటారు.

రైతులకు వ్యవసాయ శాఖ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ఈ వేదికలు ఏర్పాటు చేస్తున్నదని కలెక్టర్‌ అన్నారు. ఎంపీ మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మారెడ్డి పెద్దాపురంలో మొక్కలు నాటి మాట్లాడుతూ మొక్కల సంరక్షణ మన అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్‌, డీఆర్డీవో సంపత్‌రావు, వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు భిక్షపతి, ఎంపీపీ మార్క సుమలత, జెడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు, ఎంపీడీవో నర్మద, ఏపీవో రాజిరెడ్డి, గూడెప్పాడ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాంతాల కేశవరెడ్డి, కుడా డైరెక్టర్‌ రవీందర్‌, సర్పంచ్‌ సావురే కమల రాజేశ్వర్‌రావు, ఉపసర్పంచ్‌ ఎలుకటి రవి, ఏవో యాదగిరి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, యూత్‌ విభాగం మండల అధ్యక్షుడు వేముల నవీన్‌, జిల్లా నాయకులు నాగనబోయిన సాంబయ్య, బయ్యరాజు, బొల్లోజు కుమారస్వామి, డీఆర్‌(రవీందర్‌), శివాజీ, కార్యదర్శి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.


logo