బుధవారం 12 ఆగస్టు 2020
Warangal-rural - Jul 10, 2020 , 01:24:07

గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాలి

గ్రామాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాలి

  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  గ్రామాల్లో పర్యటన

ఆత్మకూరు, జూలై 09: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రూరల్‌ జిల్లాలోని అక్కంపేట, పెద్దాపురం, కామారం, ఆత్మకూరులో గురువారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామాలను పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానికులకు సూచించారు. అనంతరం ఆత్మకూరు జీపీ కార్యాలయంలో సర్పంచ్‌ పర్వతగిరి రాజు అధ్యక్షతన అధికారులతో సమీక్షించారు. మిషన్‌ భగీరథ పనులు, తాగునీరు తదితర సమస్యలను సర్పంచ్‌ ఎమ్మెల్యేకు వివరించారు. ఎస్సీకాలనీకి వాటర్‌ ట్యాంకు ప్రతిపాదన పంపించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సతీశ్‌ను ధర్మారెడ్డి ఆదేశించారు. గ్రామంలో జంక్షన్ల వద్ద రోడ్డుకిరువైపులా ఉన్న ఇళ్ల స్థలాల యజమానులతో మాట్లాడి వారికి నచ్చజెప్పాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇళ్లు కోల్పోయిన 45 మందికి వారం రోజుల్లో బిల్లులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్‌రావు, వైస్‌ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ బయ్యరమ రాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, వార్డు సభ్యులు బయ్య రాజు, పాపని రాజు, రేవూరి జయపాల్‌రెడ్డి, వెల్దె జమున, కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.

తాజావార్తలు


logo