బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Jul 10, 2020 , 01:19:43

ఇంటింటికీ ఆరు మొక్కలు : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది

ఇంటింటికీ ఆరు మొక్కలు : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట: ఆరో విడత హరితహారంలో ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేస్తామని, వాటిని నాటి సంరక్షించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన నర్సంపేటలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలంలో మొక్కలు నాటి రక్షించే బాధ్యతను బాధ్యతాయుతంగా చేపట్టాలని సూచించారు. 90 శాతం మనుగడ సాధించేందుకు వాటిపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. పట్టణ పరిధిలో రెండు లక్షల 42 వేల మొక్కలు నాటాలని టార్గెట్‌ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజినీకిషన్‌, వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ విద్యాధర్‌, కౌన్సెలర్లు రాజు, ఇందిర, పద్మ తదితరులు పాల్గొన్నారు.