శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Jul 07, 2020 , 05:28:39

మంత్రితో ఇన్‌చార్జి సీపీ భేటీ

మంత్రితో ఇన్‌చార్జి సీపీ భేటీ

  • పర్వతగిరిలో ఎర్రబెల్లికి పుష్పగుచ్ఛం అందించిన ప్రమోద్‌కుమార్‌ 
  •  శాంతిభద్రతలు, కరోనా కట్టడిపై చర్చ 
పర్వతగిరి: రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును వరంగల్‌ ఇన్‌చార్జి సీపీగా బాధ్యతలు చేపట్టిన  ప్రమోద్‌కుమార్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, మొక్క అందించారు. ఈ మేరకు పర్వతగిరిలోని మంత్రి స్వగృహంలో కొద్దిసేపు ఎర్రబెల్లితో ముచ్చటించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో శాంతిభద్రతలపై చర్చించారు. కరోనా వైరస్‌ కట్టడికి పోలీసులు తీసుకుంటున్న చర్యలను సీపీ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణపై దయాకర్‌రావు సీపీకి పలు జాగ్రత్తలు, సూచనలు చేశారు. అనంతరం ఇన్‌చార్జి సీపీ పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. తొలిసారిగా స్టేషన్‌కు వచ్చిన ఆయనకు మూమునూరు ఏసీపీ శ్యాంసుందర్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్‌బాబా పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. తర్వాత స్టేషన్‌ ఆవరణలో సీపీ మొక్క నాటారు.