ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Jul 06, 2020 , 07:03:14

ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలు

ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలు

  • జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి
  • జిల్లా పరిషత్‌లో హరితహారం

వరంగల్‌రూరల్‌- నమస్తేతెలంగాణ : ప్రభు త్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే దిశ లో తాను ముందుకు వెళ్తున్నట్లు జెడ్పీ చైర్‌పర్స న్‌ గండ్ర జ్యోతి చెప్పారు. సీఎం కేసీఆర్‌ది ప్ర జారంజక పాలన అన్నారు. సీఎం కేసీఆర్‌, రా ష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కే టీ రామారావు ఆశీర్వాదంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. జెడ్పీ చైర్‌ పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఆదివారం హన్మకొండ లోని జెడ్పీ కార్యాలయ ఆవరణలో జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి మొక్కలు నాటారు. శా యంపేట జెడ్పీటీసీ స్థానం నుంచి గెలుపొందిన ఆమె 2019 జూలై 5న వరంగల్‌ రూరల్‌ జెడ్పీ తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

జెడ్పీ చైర్‌ప ర్సన్‌గా గత ఏడాది కాలంలో గండ్ర జ్యోతి జి ల్లాలో తనదైన ముద్ర వేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ గా రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జెడ్పీ కార్యాలయ ఆవరణలో హ రితహారం నిర్వహించారు. జిల్లాలోని జెడ్పీటీసీ లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు, అ ధికారుల సహకారంతో పరిపాలన మొదటి సం వత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నట్లు చె ప్పారు. సహకరించిన అన్ని శాఖల అధికారు లు, జెడ్పీ ఆఫీసు సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పా రు.

జెడ్పీటీసీలు, అధికారులతో కలిసి ఇక్కడ వి విధ రకాల మొక్కలు నాటారు. కార్యక్రమం లో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, ఆత్మకూ రు, చెన్నారావుపేట, దామెర, గీసుగొండ, నడి కూడ, నర్సంపేట, పరకాల, రాయపర్తి, సంగెం, వర్ధన్నపేట జెడ్పీటీసీలు రాధిక, పత్తినాయక్‌, జీ కల్పన, పీ ధర్మారావు, కే సుమలత, కే జయ మ్మ, సీహెచ్‌ మొగిలి, కుమారస్వామి, సుదర్శన్‌ రెడ్డి, భిక్షపతి, కో ఆప్షన్‌ సభ్యుడు నబీ, జెడ్పీ సీ ఈవో రాజారావు, వివిధ విభాగాల అధికారు లు, టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.

ఖానాపురంలో..

ఖానాపురం : హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్‌ అశోక్‌ అన్నారు. అయోధ్యనగర్‌లో జీపీ ఆధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

నెక్కొండలో.. 

నెక్కొండ : హరితహారాన్ని గ్రామంలో పకడ్బందీగా నిర్వహించాలని సర్పంచ్‌ మాదాసు అనంతలక్ష్మీరవి అన్నారు. అలంకానిపేటలో సర్పంచ్‌ మొక్కలు నాటారు. ఉపసర్పంచ్‌ గుం టుక నర్సయ్య, ఎంపీటీసీల ఫోరం మండలా ధ్యక్షుడు కర్పూరపు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

చెన్నారావుపేటలో...

చెన్నారావుపేట : మండలంలోని అక్కల్‌చెడ జీపీ కార్యాలయంలో సర్పంచ్‌ తూటి పావని ఇంటింటికీ ఐదు రకాల మొక్కలు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో తూటి రమేశ్‌, ఉపసర్పంచ్‌ బానోత్‌ వీరన్న, వార్డు సభ్యులు ఈర్ల వనిత, ఆకుల అశోక్‌, స్వామి, రవి, కారోబార్‌ కరెడ్ల రా జు, సిబ్బంది శేఖర్‌, రాజు పాల్గొన్నారు.

వర్ధన్నపేటలో..

వర్ధన్నపేట : మండలంలోని ఇల్లంద శివారులోని కంఠమహేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో గౌడ సంఘం నాయకులు మొక్కలు నా టారు. ఆలయ సమగ్రాభివృద్ధికి కృషి చేయాల ని ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు స మ్మెట లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు సట్ల భిక్షపతి, నాయకులు సట్ల సూర్యనారాయణ, సట్ల సమ్మయ్య, సమ్మెట యాకయ్య, సట్ల సుభాశ్‌, కవిరాజు, సాయిలు, నర్సింహులుగౌడ్‌ పాల్గొన్నారు.

మొక్కలతోనే మానవ మనుగడ.. 

నర్సంపేట రూరల్‌ : మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని లక్నెపల్లి సర్పంచ్‌ గొడిశాల రాంబాబు, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత అ న్నారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చే శారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కత్తి కిరణ్‌, సాంబ య్య, రమేశ్‌, కార్యదర్శి అనిత, కారోబార్‌ ఉల్లేరావు రాజయ్య పాల్గొన్నారు.