శుక్రవారం 07 ఆగస్టు 2020
Warangal-rural - Jul 05, 2020 , 01:49:35

జిల్లాలో మోస్తరు వర్షం

జిల్లాలో మోస్తరు వర్షం

కలెక్టరేట్‌, జూలై 04 : జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా చెన్నారావుపేటలో 88.6 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పర్వతగిరిలో 17.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు సీపీవో శామ్యూల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పరకాలలో 24.2 మి.మీ, శాయంపేటలో 47.4 మి.మీ, గీసుగొండలో 60.4 మి.మీ, ఆత్మకూరులో 57.4 మి.మీ, దుగ్గొండిలో 30.4 మి.మీ, నర్సంపేటలో 52.2 మి.మీ, ఖానాపూర్‌లో 65.8 మి.మీ, రాయపర్తిలో 26.4 మి.మీ, నల్లబెల్లిలో 45.4 మి.మీ, సంగెంలో 33.2 మి.మీ, వర్ధన్నపేటలో 35 మి.మీ, నెక్కొండలో 66.4 మిల్లీమీటర్లు నమోదైందని తెలిపారు.    

నర్సంపేటలో..

నర్సంపేట : నర్సంపేటలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వర్షం పడింది. దీంతో చెరువుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతున్నది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. logo