సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

రిటైర్డ్ సీపీ డాక్టర్ విశ్వనాథ రవీందర్
నయీంనగర్, జూలై 01 : సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని రిటైర్డ్ సీపీ డాక్టర్ విశ్వనాథ రవీందర్ అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో రవీందర్‌కు బుధవారం జర్నలిస్టులు ఆత్మీయ సన్మానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగ సమయంలో జర్నలిస్టులు ఎంతగానో ప్రోత్సాహం అందించారని తెలిపారు. పోలీసులు సరిగా పనిచేస్తున్నారా లేదా అని ప్రజలకు తెలియజేసేది మీడియానే అని చెప్పారు. 2018 సంవత్సరంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జర్నలిస్టులు ఎంతగానో సహకారం అందించారని అన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్, జర్నలిస్టు సంఘం నాయకులు గోకారపు సుధీర్, పిన్నా శివకుమార్, మధు, అమర్, రంజిత్, శ్యాం, శ్రీకాంత్, సంపెట సుధాకర్, దిలీప్, రమేశ్, తిరుమల్, సందెల సాగర్ తదితరులు పాల్గొన్నారు.