సోమవారం 18 జనవరి 2021
Warangal-rural - Jul 02, 2020 , 00:40:54

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే చల్లా

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే  చల్లా

రూ.6.93 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ 

పరకాల : ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సంగెం మండలాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ.6,93,500ల విలువైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నేరుగా ప్రజలకు చేరవేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలన్న సీఎం ఆకాంక్ష మేరకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నారన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. కరోనా మహమ్మారి దరి చేరకుండా ఉండాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.