సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలి

మండలస్థాయి అధికారుల పనితీరు మారాలి
లేకపోతే చర్యలు : కలెక్టర్ హరిత
రాయపర్తి, జూలై 01 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, లేకపోతే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ముండ్రాతి హరిత హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో పల్లె ప్రగతి, ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సకల వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
చురుగ్గా పని చేయాలి
మండల స్థాయి అధికారులు చురుగ్గా పని చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. పలు గ్రామాల్లో మీట ర్లు బిగించకుండా బిల్లులు చెల్లించాలంటూ ఒత్తిడి తె స్తున్నారని పలువురు సర్పంచులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఎంపీవో రామ్మోహన్, ఎంపీడీవో రామ్మోహనాచారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో ఎంపీడీవో, ఎం పీవో, విద్యుత్‌శాఖ ఏఈలు రాజశేఖర్, అజయ్‌కుమా ర్, పీఆర్ ఏఈ నరేశ్‌కుమార్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరు బాగా లేనందునే మండ ల స్థాయిలో సమీక్షలు జరుపాల్సి వస్తున్నదన్నారు.
‘విలేజ్ పార్కు’ స్థల పరిశీలన
మండల కేంద్రంలో సర్పంచ్ గారె నర్సయ్య నేతృత్వంలో గ్రామ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ప్రతిపాదించిన ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ హరిత తహసీల్దార్ సత్యనారాయణతో కలసి సందర్శించారు. సమావేశంలో జెడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్, జెడ్పీ సీఈవో రాజారావు, డీపీవో నారాయణరావు, డీఆర్డీవో సంపత్‌రావు, డీఆర్డీఏ ఏపీడీ వసుమతి, డీఎల్పీవో నాగపురి స్వరూప, స్వచ్ఛభారత్ జిల్లా ప్రతినిధి మాలినేని శ్రీనివాస్‌రావు, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, ఐబీ ఏఈ అమర్నాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పర్వతగిరిని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలి
కలెక్టరేట్ : ఆదర్శ మండలంగా పర్వతగిరిని తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రూర్బన్ పథకం కింద ఎంపికైన పర్వతగిరి మండలాన్ని అభివృద్ధి చేయడానికి చేపట్టబోయే పనులు, వాటి అంచనాలను త్వరలో అందజేయాలన్నారు. రూర్బన్ పథకం జాయింట్ కమిషనర్ మారుపాక నగేశ్, డీఆర్డీవో సంపత్ రావు, పీఆర్ ఈఈ సంపత్, ప్రాజెక్టు మేనేజర్ నర్సింహులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అచ్చెన్నాయుడుకు నోటీసులు
- సమస్యల పరిష్కారానికే ‘ప్రజా వేదిక’
- 31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్
- భారత్‌కు బయలుదేరిన మరో మూడు రాఫెల్స్
- రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
- 'ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువైతే అంత మంచిది'
- ధారావిలో కరోనా కేసులు నిల్
- ఏపీ సమాచార కమిషనర్‌కు ఎస్ఈసీ మెమో
- రిపబ్లిక్ డే హింస.. దేశానికే అవమానం : అమరిందర్ సింగ్
- తెలుగు సినీ ప్రముఖులకు వృక్షవేదం పుస్తకం అందజేత