ఆదివారం 05 జూలై 2020
Warangal-rural - Jul 01, 2020 , 01:31:24

పాడి రైతులు మోసపోవద్దు

పాడి రైతులు మోసపోవద్దు

ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రాజేంద్రన్‌

రెడ్డికాలనీ: పాడి రైతులు ప్రైవేటు డెయిరీల బారినపడి మోసపోవద్దని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్‌ సూచించారు. మంగళవారం ఆమె హన్మకొండలోని విజయ డెయిరీని ఎండీ శ్రీనివాస్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీడీ ప్రదీప్‌కుమార్‌తో డెయిరీలోని పాల ప్లాంటును సందర్శించారు. పాల సేకరణ, విక్రయాలు తెలుసుకున్నారు. విజయ డెయిరీకి పాలు పోసి ఆర్థికాభివృద్ధి సాధించాలని రైతులను కోరారు. అనంతరం విజయ డెయిరీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో విజయ డెయిరీ ఉపసంచాలకుడు ప్రదీప్‌కుమార్‌, వరంగల్‌ డెయిరీ మేనేజర్‌ శ్రీతేజ, అసిస్టెంట్‌ డెయిరీ మేనేజర్‌ హరికృష్ణ, సీనియర్‌ అసిస్టెంట్‌ హన్మంతు, అకౌంటెంట్‌ భవాని, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ శాబర్తి సురేశ్‌ పాల్గొన్నారు.


logo