సోమవారం 06 జూలై 2020
Warangal-rural - Jun 30, 2020 , 05:33:17

వ్యవసాయ రంగానికి పెద్దపీట

వ్యవసాయ రంగానికి పెద్దపీట

  • అన్నదాత సంక్షేమం కోసమే రైతు వేదికలు
  • ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
  • రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి

స్టేషన్‌ఘన్‌ఫూర్‌, జూన్‌ 29: ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసా య రంగానికి పెద్దపీట వేశారని, అన్నదాతల సంక్షేమం కోసమే రాష్ట్రంలో రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండలో సోమవారం మంత్రి ఎమ్మెల్యే రాజయ్య, కలెక్టర్‌ నిఖిలతో కలిసి రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామంలో హరితహరంలో మొక్కలు నాటి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే, గ్రామంలోని వల్లభారాయి చెరువు నుంచి ఆయకట్టుకు తూము ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం సర్పంచ్‌ చల్లా ఉమా సుధీర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. తాటికొండకు ప్రత్యేక చరిత్ర ఉన్నదని, సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ ఇక్కడి నుంచే పోరాటం చేసి విజయం సాధించారని గుర్తుచేశారు. గ్రామంలో పార్కు ఏర్పాటు చేసి జనగామ జిల్లాకే తలమానికంగా తయారు చేయాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది 52 లక్షల మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు. తాటికొండలో మంకీ ఫుడ్‌కోర్టులకు అనువైన కొండలు ఉన్నాయన్నారు. మండలంలోని చెరువులకు కాల్వల ద్వారా నీరందించే బాధ్యతను తానే తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. తాటికొండకు సీసీరోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు చేస్తానన్నారు. ఐకేపీ భవనం నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జనగామ కలెక్టర్‌ నిఖిల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏడవెల్లి కృష్ణారెడ్డి, డీఆర్డీవో రాంరెడ్డి, జెడ్పీసీఈవో రమాదేవి, ఆర్డీవో రమేశ్‌, జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, వైస్‌ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ అక్కనపల్లి స్వర్ణలత బాలరాజు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్‌, చిలుపూర్‌ మండల ఇన్‌చార్జి అధ్యక్షులు ఏడవెల్లి విజయ, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు సురేశ్‌కుమార్‌, పీఎసీఎస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకులు పొట్లపల్లి శ్రీధర్‌బాబు, చిలుపూర్‌గుట్ట దేవస్థాన చైర్మన్‌ ఇనుగాల నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు పోగుల సారంగపాణి, మాలోత్‌ లలిత, ఆనందం, మణెమ్మ, ఉపసర్పంచ్‌లు మారపాక రాములు, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

రెడ్డికాలనీ: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పిలుపునిచ్చారు. హన్మకొండ 39వ డివిజన్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ఖాజా సిరాజుద్దీన్‌, స్థానిక కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌, నాయకులు పులి రజినీకాంత్‌, కోన శ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 హరిత వరికోల్‌కు పిలుపు

నడికూడ: హరిత వరికోల్‌ను నిర్మించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం రైతు వేదిక భవన ప్రాంతం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు, 50 లక్షలతో నిర్మిస్తున్న ఫంక్షన్‌ హాల్‌ను సందర్శించారు. అనంత రం సర్పంచ్‌, వైస్‌ ఎంపీపీ, వార్డు సభ్యు లతో గ్రామాభివృద్ధిపై సమీక్షించారు. హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సమీక్షలో సర్పంచ్‌ సాదు నిర్మల, ఉప సర్పంచ్‌ సుమలత, వైస్‌ ఎంపీపీ చంద కుమారస్వామి పాల్గొన్నారు.

విరివిగా మొక్కలు నాటాలి

చెన్నారావుపేట: హరితహారంలో ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. మండలంలోని కోనాపురం లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం గుట్ట ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. అలా గే, కోనాపురంలో గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఆర్డీవో పవన్‌కుమార్‌, ఎంపీపీ  విజేందర్‌, జెడ్పీటీసీ పత్తినాయక్‌, డీఎల్‌పీవో వెంకటేశ్వర్లు, వైస్‌ ఎం పీపీ కంది కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షుడు బాల్నె వెంకన్న పాల్గొన్నారు.

ప్రజలను భాగస్వాములను చేయాలి

ఆత్మకూరు: హరితహారంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని అక్కంపేట, లింగమడుగుపల్లిలో ఆయన మొక్కలు నాటారు. ఏనుమాముల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం, ఎంపీపీ మార్క సుమలత, జెడ్పీటీసీ కక్కెర్ల రాధిక, ఎంపీడీవో నర్మద, ఏపీవో రాజిరెడ్డి, గూడెప్పాడ్‌ మార్కెట్‌ చైర్మన్‌ కాంతాల కేశవరెడ్డి, కుడాడైరెక్టర్‌ రవీందర్‌, సర్పంచ్‌లు ఎనకతళ్ల విజయ హంసాల్‌రెడ్డి, జిల్లెపల్లి రాజేశ్వరి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించాలి

కేసముద్రం టౌన్‌: ప్రతి వ్యక్తి ఒక మొక్కను పోషించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్‌లో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి సీతామహాలక్ష్మి, రాష్ట్ర మార్క్‌ఫైడ్‌ డైరెక్టర్‌ మర్రి రంగారావు, ఎంపీపీ ఓలం చంద్రమోహన్‌, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచ్‌  భట్టు శ్రీను, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మా దారపు సత్యనారాయణ్‌రావు పాల్గొన్నారు.


logo