ఎరువులు, విత్తనాల కొరత లేదు

- కేతిడి దామోదర్ రెడ్డి, ఏడీఏ, వరంగల్ అర్బన్
వరంగల్ సబర్బన్ : ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరందుకుంటున్న దృష్ట్యా వరంగల్ ఏడీఏ దామోదర్ రెడ్డి ‘నమస్తే’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎక్కడా ఎరువులు, విత్తనాల కొరత లేదని, రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బు జమవుతున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నమస్తే : ఈ ఏడాది విత్తనాల పరిస్థితి ఎంటి?
ఏడీఏ : ఈసారి ప్రభుత్వం ముందుచూపుతో వ్యవవహరించడంతో విత్తనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 70 శాతం వరకు రైతులు విత్తుకున్నారు. వరిలో సన్నరకాలు పోసుకున్నారు. మిర్చి విస్తీర్ణం పెరిగే అవకాశముంది.
నమస్తే : ఎరువులు అందుబాటులో ఉన్నాయా?
రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జూన్‌కు కావాల్సిన ఎరువులన్నీ ఉన్నాయి. బఫర్ నిల్వలు కూడా మార్క్‌ఫెడ్‌లో ఉన్నాయి. 8వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తొందరపడి ఎక్కువగా కొనుక్కోవద్దు.
నమస్తే : వర్షపాతం ఎలా ఉండబోతున్నది?
ఇప్పటికి వర్షాలు పడాల్సిన దానికంటే ఎక్కువే పడ్డాయి. 25 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి వర్షాలు ఆశాజనకంగానే ఉన్నాయి.
నమస్తే : నియంత్రిత వ్యవసాయంపై రైతుల స్పందన ఎలా ఉంది ?
ప్రభుత్వం తెచ్చిన నియంత్రిత వ్యవసాయంపై రైతులు సానుకూలంగా ఉన్నారు. సర్కారు సూచించినట్లుగానే నియంత్రిత సాగు బాటపట్టారు. మక్కసాగు బంద్ చేశారు. ప్రతి రైతు తాను వేసే పంట వివరాలను స్థానిక ఏఈవోకు చెప్పి నమోదు చేసుకోవాలి. పంట అమ్ముకునేటప్పుడు రైతులకు ఇబ్బందులు ఉండవు.
నమస్తే : సాగు నీటి సౌకర్యం ఎలా ఉంది?
ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టులతో ఇప్పుడు సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నది. రైతులు మంచి భూములను అనవసరంగా పొలాలుగా మార్చి పాడు చేసుకోవద్దు. భవిష్యత్‌లో పొలం కంటే ఇతర పంటలకే మంచి లాభాలు వస్తాయి.
నమస్తే : రైతుబంధు డబ్బులు అందరికీ వస్తాయా?
అర్హత ఉన్న ప్రతి రైతుకూ రైతుబంధు డబ్బు అందుతుంది. జూన్16 వరకు పట్టాదారు పాస్ బుక్కులు వచ్చిన రైతులు కూడా వ్యవసాయ కార్యాలయంలో సమర్పించాలి. రైతుబంధు డబ్బు వచ్చిన రైతులు తొందరపడి గుంపులుగా బ్యాంకులకు వెళ్లొద్దు.
తాజావార్తలు
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్‌లో హైదరాబాదీ అరెస్ట్