శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Jun 23, 2020 , 01:29:58

మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టాలి

మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టాలి

పర్వతగిరి, జూన్‌ 22 : హరితహారానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండి, మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టాలని కలెక్టర్‌ హరిత అన్నారు. సోమవారం మండలంలోని వడ్లకొండ, అన్నారంషరీఫ్‌ గ్రామాల్లోని నర్సరీలు, డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రగతి పురోగతిని కలెక్టర్‌ పరిశీలించారు. తొలుత నర్సరీల్లోని మొక్కల ఎదుగుదలను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి టీఏలకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి గ్రామానికి నర్సరీని ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, తహసీల్దార్‌ మ హబూబ్‌ అలీ, ఎంపీపీ కమల, అన్నారం షరీ ఫ్‌ సర్పంచ్‌ యశోద, వడ్లకొండ ఎంపీటీసీ రేవ తి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

కార్యదర్శులకు అవగాహన..

పరకాల : హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే విధానంపై జీపీ కా ర్యదర్శులకు సోమవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ ఝా న్సీ అవగాహన కల్పించారు. ఎంపీపీ స్వర్ణలత, ఎంపీడీవో బాలకృష్ణ, అధికారులు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..

ఆత్మకూరు : గ్రామాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యానశాఖాధికారి శంకర్‌ అన్నారు. మండల కేంద్రంలో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యానశాఖ, ఎన్‌ఆర్‌జీఎస్‌, సం యుక్తంగా ఆగ్రో ఫారెస్టు పథకంలో బాగంగా గ్రామాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేపడుతున్నామ న్నారు. రైతులు 7997725086 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

రాయపర్తిలో ‘హరితహారం’..

నడికూడ : మండలంలోని రాయపర్తిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పం చ్‌ రావుల సరితారాజిరెడ్డి ఆధ్వర్యంలో మొ క్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జీపీ కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్తలు, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతులకు శ్రీగంధం మొక్కలు..

శాయంపేట : ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యానశాఖ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సంయుక్తంగా ఆగ్రో ఫారెస్టు పథకంలో భాగంగా బ్లాక్‌ ప్లాంటేషన్‌ను చేపడుతున్నాయని ఉద్యాన శాఖ అధికారి శంకర్‌ తెలిపారు. శ్రీగంధం, మలబార్‌, వేప, టేకు మొక్కలు నాటొచ్చన్నారు.