ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Jun 23, 2020 , 01:24:42

ప్రతిభావంతులకు సన్మానం

ప్రతిభావంతులకు సన్మానం

స్టేషన్‌ఘన్‌పూర్‌, జూన్‌ 22: మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీలో విధులు నిర్వర్తిస్తున్న ప్రముఖ ఇంద్రజాలికుడు జూల కుంట్ల శ్రీనివాస్‌రెడ్డికి సోమవారం హైదరాబాద్‌ లో అరుదైన పురస్కారం లభించింది. ఆయన ఇంద్రజాలాన్ని గుర్తించి మయూరి ఆర్ట్స్‌, తెలంగా ణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డికి ‘విశ్వకళ నంది’ పురస్కారంతో పాటు మెడల్‌, సర్టిఫికెట్‌ను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది ఏప్రిల్‌ 5న ఉగాది రోజు నిర్వహించాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో వాయిదా వేశారు. కరోనా నిబంధ నల ప్రకారం అతి తక్కువ మందితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మయూరి ఆర్ట్స్‌ నిర్వాహకులు రాధ, డైరెక్టర్లు సాయిప్రియ, దత్తు మెజీషియన్‌ రామడుగు వసంత్‌ హాజరై శ్రీనివాస్‌రెడ్డికి పురస్కారం అందజేశారు. మూడు దశాబ్దాలుగా ఇంద్రజాల ప్రదర్శనలో శ్రీనివాస్‌రెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంద్రజాల రంగంలో  తాను చేసిన కృషికి ‘విశ్వకళానంది’ పురస్కారం రావడం ఆనందంగా ఉందని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 

ఉపాధ్యాయుడికి విశ్వకళ నంది అవార్డు

ఐనవోలు: మండలంలోని ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మార్త రాజమౌళి విశ్వకళ నంది అవార్డు అందుకున్నా రు. మయూరి ఆర్ట్స్‌, తెలంగాణ భాషా సాంస్కృ తిక శాఖ అనుక్షణం విద్యార్థుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న రాజమౌళిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సర్పంచ్‌ ఆడెపు దయాకర్‌, ఎస్‌ ఎంసీ చైర్మన్‌ పొన్నాల రాజు, హెచ్‌ఎం రమాదేవి ఆయ నను అభినందించారు.