బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Jun 14, 2020 , 00:48:44

విత్తనాల కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం

విత్తనాల కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం

పరకాల  : వానకాలం పంటల సాగుకు రైతులు విత్తనాల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వం నకిలీలపై పకడ్బందీగా వ్యవహరిస్తున్నా కొందరు కేటుగాళ్లు అక్కడక్కడా మోసాలు చేస్తూనే ఉంటారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి పలు చోట్ల నకిలీ విత్తనాల గుట్టురట్టు చేసిన ఘటనలు ఉన్నాయి. కొనుగోళ్లలో జాగ్రత్తలు వహించకుంటే మోసపోవాల్సి వస్తుందని  పరకాల ఏడీఏ అవినాశ్‌ శర్మ పలు సూచనలు చేశారు. 

విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే ముందు దుకాణాదారుడి లైసెన్స్‌ను పరిశీలించాలి. 

బస్తా లేదా సంచి చినిగి ఉండడం, రంధ్రాలు ఉంటే మంచివి ఇవ్వాలని దుకాణాదారుడిని అడగాలి. 

మిషన్‌ కుట్టుతో ఉన్న సంచులనే కొనుగోలు చేయాలి.  

ప్రతి ప్యాకెట్‌కు బిల్లులు, సంచులను పంటకాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. 

శాస్త్రవేత్తలు సూచించిన మందులను మాత్రమే చీడపీడల నివారణకు పిచికారీ చేయాలి. 

రెండు, మూడు రకాల పురుగు మందులను కలిపి వాడొద్దు. 

అవగాహన ఉన్న విత్తనాలనే తీసుకోవాలి. దుకాణదారుడు తనకొచ్చే ఆఫర్లను అంటకట్టే ప్రయత్నం చేస్తే తిరస్కరించకపోతే నష్టపోవాల్సి వస్తుంది. 

ఏయే పంటలకు ఎలాంటి మందులు వాడాలో వ్యవసాయ అధికారుల సలహా మేరకు వాడితే ప్రయోజనం ఉంటుంది. 

అధిక మోతాదులో ఎరువులు వాడినా దిగుబడిపై ప్రభావం ఉంటుంది. logo