ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Jun 09, 2020 , 04:24:15

స్వీయ నిర్బంధంతోనే కరోనా కట్టడి

స్వీయ నిర్బంధంతోనే కరోనా కట్టడి

  • సామూహిక కార్యక్రమాలు రద్దు చేసుకోవాలి 
  •  రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి

రాయపర్తి, జూన్‌ 08: కరోనా వైరస్‌ను స్వీయ నిర్బంధంతోనే కట్టడి చేయొచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు. మండలంలోని కిష్టాపురం క్రాస్‌రోడ్డు వద్ద పన్యానాయక్‌తండాకు చెందిన మొరిపిరాల ఎంపీటీసీ సభ్యురాలు భూక్య క్రాంతి భర్త, టీఆర్‌ఎస్‌ నాయకుడు, ఆర్టీసీ డ్రైవర్‌, భూక్య విజయ్‌కుమార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా సోమవారం ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  తెలంగాణ ప్రభుత్వ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు.  మృతుడు భూక్య విజయ్‌కుమార్‌ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మునావత్‌ నర్సింహనాయక్‌, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్‌, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌రావు, నాయకులు పూస మధు,  నర్సయ్య, సొసైటీ చైర్మన్లు కుందూరు రాంచంద్రారెడ్డి, వెంకటరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు చెడుపాక కుమారస్వామి, వెంకట్రాంనాయక్‌, అండ్రెడ్డి యాదమ్మ యాకూబ్‌రెడ్డి, ఉప్పలమ్మ, గట్టు నర్సింహాచార్యులు, కన్నెకంటి శ్రీనివాస్‌రెడ్డి, నాగపురి సోమయ్య, తాళ్లపల్లి సంతోశ్‌గౌడ్‌, అయిత రాంచందర్‌,  జాజునాయక్‌ పాల్గొన్నారు. అనంతరం పెర్కవేడుకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు బండి కుమార్‌యాదవ్‌ కుమారుడు కరుణాకర్‌ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట సర్పంచ్‌ చిన్నాల తారాశ్రీ, ఎంపీటీసీ అనూష తదితరులు ఉన్నారు.


logo