వ్యవసాయం.. నేడు పండుగలా మారింది

- సీఎం కేసీఆర్ కృషి మరువలేనిది
- నియంత్రిత పంటలతో రైతులకు మేలు
- రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వర్ధన్నపేట/ పర్వతగిరి,జూన్ 7 : నీరులేక ఒకప్పుడు దండుగ అన్న వ్యవసాయం సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా పచ్చని పంట పొలాలతో నేడు పండుగలా మారిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఆయన పంట భూములు, తోటలను కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. భూమి చుట్టూ ఉన్న రైతులు, కూలీలతో పంటల సాగుపై చర్చించారు. రైతులు, కూలీల పిల్లలకు మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో సాగునీరు లేక లక్షల ఎకరాలు బీళ్లుగా మారాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి పచ్చని పొలాలుగా మార్చారన్నారు. నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించి తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీటిని అందించడం చరిత్రలో నిలిచిపోయే అంశంగా వర్ణించారు. రైతులు నియంత్రిత సాగు విధానాన్ని పాటించాలని మంత్రి సూచించారు. ధరలు లేని పంటలు పండించి నష్టపోయే కంటే ప్రభుత్వం సూచించిన పంటలు పండించి లాభం పొందాలన్నారు. పంటల సాగులో వ్యవసాయశాఖ నిపుణులు, అధికారుల సూచనలు పాటించాలన్నారు. మంత్రి వెంట ఆయన సతీమణి ఉషాదయాకర్‌రావు, కుమారుడు ప్రేమ్‌రావు, రైతులు ఉన్నారు.
తాజావార్తలు
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్