శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Jun 08, 2020 , 02:22:56

టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి

టీఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ధి

నర్సంపేట, జూన్‌ 07: టీఆర్‌ఎస్‌ తోనే గ్రామాలు అభి వృద్ధి చెందుతున్నా యని  నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లబెల్లి మం డలంలోని పెద్ద చెరు వు బతుకమ్మ నుంచి రేగులకుంట బతుకమ్మ వరకు రూ.60 లక్షల నిధులు, నల్లబెల్లి కరంట్‌ ఆఫీసు నుంచి కారుణ్యజ్యోతి స్కూల్‌ వరకు రూ.1.40 లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  ప్రాజెక్టుల నిర్మాణంతో లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నల్లబెల్లిమండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు రంగాయచెరువుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్‌గౌడ్‌, సొసైటీ చైర్మన్‌ చెట్టుపెల్లి మురళీధర్‌, వైస్‌ ఎంపీపీ గందె శ్రీలతశ్రీనివాస్‌, మండల అధ్యక్షుడు బానోత్‌ సారంగపాణి, రైతుబంధు సమితి బాధ్యులు, సర్పంచ్‌, ఎంపీటీసీ పాల్గొన్నారు.