ప్రగతిపథంలో గంగారం

- పాలకవర్గం ప్రత్యేక దృష్టి
- ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు
- కలెక్టర్ చొరవతో మారుతున్న గ్రామ రూపురేఖలు
- కూరగాయల సాగు పెంపునకు ప్రణాళిక
- సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధుల అడుగులు
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించి, పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నది. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారుస్తున్నది. ఇంటికో మరుగుదొడ్డి, ఇంకుడుగుంత ఏర్పాటు చేయిస్తున్నది. ప్రతి వీధిలో సీసీ రోడ్డు వేయిస్తు న్నది.
ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నది. విద్యుద్దీపాలు, గ్రామానికో వైకుంఠధామం, కంపోస్టు షెడ్, డంపింగ్ యార్డు, నర్సరీ ఏర్పాటు చేయిస్తున్నది. వందశాతం పన్నుల వసూలు, ప్లాస్టిక్ నిషేధం అమలు,
గ్రామసభల నిర్వహణ, అభివృద్ధి కమిటీల ఏర్పాటు, హరితహారంలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడు తున్నది. పంచాయతీకో ట్రాక్టర్‌ను అందుబాటులోకి తెచ్చి పరిశుభ్రతను పెంపొందిస్తున్నది. సీఎం కేసీఆర్ చొరవతో మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలు అద్దంలా మెరిసిపోతున్నాయి. దీనికి నిదర్శనమే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగారం. ఈ గ్రామం జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) అవార్డును దక్కించుకుని ఆదర్శంగా నిలిచింది.
-కాటారం
గంగారం గ్రామ జనాభా 2,446. పురుషులు 1197, మహిళలు 1249 మంది ఉన్నారు. మొత్తం 1474 మందికి ఓటు హక్కు ఉంది. అందులో 720 మంది పురుషులు, 754 మంది మహిళలున్నారు. వ్యవసాయ భూమి 2500 ఎకరాలు ఉంది. ముఖ్యంగా ఇక్కడి రైతులు కూరగాయలు, వరి, పత్తి పంట సాగు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం గ్రా మంలో చెత్తా చెదారం పేరుకుపోయి కనిపించేంది. మలమూత్రాల కంపు స్వాగతం పలికేది. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉండేవి. రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యేవి. సమీపంలో మానేరు వాగు ఉన్నా తాగు, సాగు నీరు అందకపోయేది. వీధిదీపాలు వెలగకపోయేవి. పంచాయతీ భవనం లేక అరకొర ఏర్పాట్ల మధ్య నిర్వహణ సాగేది. సబ్‌సెంటర్ పిచ్చిమొక్కలతో కళ తప్పి ఉండేది. ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్పంచ్‌గా ఎన్నికైన దేవేందర్‌రెడ్డి తన పాలకవర్గంతో గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. గ్రామంలోని పెద్దలు, మహిళలు, పిల్లలను భాగస్వాములను చేశాడు. ప్రభుత్వ పథకాలు, నిధులు, పల్లె ప్రగతి కార్యక్రమాలను అందరి ఆలోచనలతో సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని ప్రగతి బాట పట్టించాడు. వివిధ కమిటీలు ఏర్పాటు చేసి సమగ్రాభివృద్ధి దిశగా సాగుతున్నారు.
కలెక్టర్ ప్రత్యేక చొరవ
గంగారాన్ని సమగ్రాభివృద్ధి చేసేందుకు కలెక్టర్ అబ్దుల్ అజీమ్ చొరవ తీసుకున్నారు. అక్కడ పర్యటించి, స్థితిగతులను పరిశీలించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయం తీసుకున్నారు. డీపీవో చంద్రమౌళి, సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, ఎంపీటీసీ చీర్ల తిరుమల తిరుపతిరెడ్డి, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, రైతులతో సమావేశాలు నిర్వహించారు. కూరగాయల సాగు పెంపు, మార్కెట్ సౌకర్యం కల్పించడం, చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడం కోసం ప్రణాళికలు రూపొందించారు. అలుగు వాగు, విలాసాగర్, బొమ్మారపు చెరువులు, సింగపురం కుంటతో పాటు మరో 5 కుంటలను సమీపంలోని మానేరు నీటితో నింపేందుకు ప్రణా ళికలు రూపొందిస్తున్నారు.
కూరగాయల సాగులోనూ టాప్
గంగారంలో 300 కుటుంబాలు కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాయి. పండిన కూరగాయలను మంథని, భూపాలపల్లి తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాయి. పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలో కూరగాయల సాగుకు ఈ గ్రామం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడ పందిరి సాగుకు 100యూ నిట్లు మంజూరయ్యాయి. ఇటీవల మరో 175 యూనిట్లను కలెక్టర్ మంజూరు చేశారు. కాగా, ఈ గ్రామంలో 150 మంది క్రీడాకారులున్నారు. ఖోఖో, కబడ్డీలో రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి బంగారు, కాంస్య పతకాలు సాధించారు.
గంగారంలో 612 ఇళ్లున్నాయి. 2018-19లో 612 ఐఎస్ఎల్ మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 400లకు పైగా ఇంకుడు గుంతలు పూర్తయ్యాయి. మొత్తం 10 వార్డులు ఉండగా, ప్రతి వార్డులో సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. సుమారు రూ. 50 లక్షల నిధులతో అన్ని వాడల్లో కలిపి 3 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్డు వేశారు. రూ. లక్షతో 270 వీధి దీపాలు ఏర్పాటు చేశారు. మోడల్ స్కూల్లో మొక్కలు నాటి ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. వైకుంఠధామం, తడిపొడి చెత్త యూనిట్ నిర్మాణంలో ఉన్నాయి. డంపింగ్ యార్డ్ ఏర్పాటు పూర్తయింది. 10 మంది పారిశుధ్య సిబ్బందితో రోజూ కార్యక్రమాలు చేపడుతున్నారు. చెత్తను తీసుకెళ్లడానికి, ఇతర అవసరాలకు జీపీకి ట్రాక్టర్ సమకూర్చుకున్నారు. 20 గుంటల స్థలంలో నర్సరీని ఏర్పాటు చేసి 20 వేల మొక్కలు పెంచుతున్నారు. గతేడాది హరితహారంలో గ్రామంలో 40 వేల మొక్కలు నాటారు. గ్రామంలో 2 వాటర్ ట్యాంకులు, 16 బోర్లు, 32 చేతి పంపులున్నాయి. మిషన్ భగీరథ ట్యాంకు పూర్తయింది. 13 గేట్ వాల్వ్‌లు ఏర్పాటు చేసి, ఇంటింటికీ భగీరథ నీటి సరఫరా చేసేందుకు పైప్‌లైన్ వేశారు. గేట్‌వాల్వ్‌ల వద్ద కుండీలు నిర్మించారు. హెల్త్ సబ్‌సెంటర్‌ను వెల్నెస్ సెంటర్‌గా మార్చి గ్రామస్తులకు ఫిజియోథెరపీ, వ్యాయామం, ధ్యానం నేర్పిస్తున్నారు. గ్రామంలో పంచాయతీ భవనం లేకపోడంతో సర్పంచ్ దేవేందర్‌రెడ్డి చెరువు గట్టు పక్కన 3 గుంటల స్థలం విరాళం ఇచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 13 లక్షలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఊరును అద్దంలా తీర్చిదిద్దుకున్నారు.
గుర్తింపు ఇలా..
ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 18 అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ, అభివృద్ధి చేసిన పంచాయతీలకు అవార్డులు అందిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో నామినేషన్లు వెళ్లాయి. ఈ సారి రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఆదివారంపేట, కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్, జయశంకర్ జిల్లాలోని గంగారం గ్రామాలకు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) అవార్డులు వరించాయి. జాతీయ పురస్కారంతో రాష్ట్రం, కేంద్రం చూపు ఈ గ్రామంపై పడింది.
భారీగా నిధులు..
గత ఆర్థిక సంవత్సరంలో గంగారానికి ప్రభు త్వం ద్వారా సుమారు రూ. 40 లక్షలు, జీపీ నిధులు రూ. 10 లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.15 లక్షలు, జెడ్పీ, ఇతర నిధులు రూ. 10 లక్షల వరకు వచ్చాయి. జీపీడీపీ అవార్డు వచ్చినందున రూ.5లక్షల ప్రోత్సాహం అందనుంది. కాగా, 2018-19 స గ్రామసభల నిర్వహణ ప్రత్యేకం..
ఈ గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర ప్రధానం. ఏ పని చేసినా గ్రామసభ ద్వారా అందరి అభిప్రాయం తీసుకుంటారు. మహిళలకు, యువతకు ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహిస్తారు. ప్రతి అంశంపై తీర్మానించి, తప్పనిసరిగా అమలు చేస్తారు. 2018-19లో సుమారు 30 గ్రామసభలు నిర్వహించారు. 2 నెలలకోసారి మహిళలతో గ్రామ సభలు జరిగాయి. గ్రామంలో పోషకాహార దినోత్సవాలు, గర్భిణులకు సీమంతాలు, ఓటర్స్ డే, ఉమెన్స్ డే తదితర వేడుకలను నిర్వహిస్తారు. వత్సరంలో ఈ గ్రామంలో ప న్నుల వసూలు వందశాతం జరిగింది. 2017-18లో రూ.51 వేలకు ఉన్న టాక్స్ డిమాండ్ 2018-19లో రూ.1.10 లక్షలకు పెరిగింది.
గంగారం ప్రొఫైల్..
జనాభా 2,446 మంది
పురుషులు 1197, మహిళలు 1249
612 ఇళ్లకు వందశాతం మరుగుదొడ్లు
400కు పైగా ఇంకుడు గుంతలు
ఇంటింటికీ నీటి సరఫరా
20 గుంటల్లో నర్సరీ ఏర్పాటు
20 వేల మొక్కల పెంపకం
హైలైట్స్..
గతేడాది హరితహారంలో
40 వేల మొక్కలు నాటిన గ్రామస్తులు
గ్రామంలోని పది వార్డుల్లోనూ సిమెంట్ రోడ్లు..
నిత్యం పదిమంది జీపీ సిబ్బందితో పారిశుధ్య పనులు
270 వీధి దీపాల ఏర్పాటు
కూరగాయల సాగులో 300 కుటుంబాలు
రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో 150 మంది ప్రతిభ
వెల్నెస్ సెంటర్ ఏర్పాటు
పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధం..