ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Jun 06, 2020 , 02:36:25

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు

వ్యవసాయాధికారుల స్పష్టం

ఉమ్మడి జిల్లాలో విత్తన, ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలు

కాటారంలో 283 లీటర్ల ైగ్లెఫోసెట్‌ పట్టివేత

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని వ్యవసాయాధికారులు, పోలీసులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభు త్వం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవా రం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించా రు. వ్యవసాయాధికారులు, సివిల్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల  దుకాణాల్లో ఆకస్మిక దాడులు చేశారు. స్టాక్‌ రిజిస్టర్లు, ఇన్వాయిస్‌, బిల్లు బుక్‌లు, రికార్డులు, మందుల లేబుల్స్‌, క్యూఆర్‌ కోడ్‌లను పరిశీలించారు. రైతులకు విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు విక్రయిస్తే వెంటనే రసీదు ఇవ్వాలని, అందులో విత్తనాల కం పెనీ, బ్యాచ్‌, లాట్‌ నెంబర్లు, రైతుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ఎమ్మార్పీకి మించి డబ్బులు తీసుకోవద్దని,  పత్తి విత్తనాలు విడిగా విక్రయించవద్దని సూచించారు. లైసెన్సులను తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలని కోరారు. ఎక్కడై నా విత్తన అక్రమ నిల్వలు ఉంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ రోడ్‌, శివనగర్‌ ప్రాంతాల్లోని విత్తన షాపుల్లో జేడీఏ ఉషాదయాళ్‌, ఏడీఏలు దామోదర్‌ రెడ్డి, విజ్ఞాన్‌, కృష్ణారెడ్డి, ఇంతేజార్‌గంజ్‌ ఎస్సై స్వామి, మిల్స్‌కాలనీ ఎస్సై భీమేశ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీ చేశారు. విత్తనాల వివరాలు తెలుసుకున్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో సీఐ శ్రీనివాస్‌జీ, ఏవో అఫ్జల్‌పాషా, ఎస్సై టీవీఆర్‌ సూరి, ఏఈవోలు ప్రశాంత్‌, వేణు రికార్డులు పరిశీలించారు. ఐనవోలు లో పర్వతగిరి సీఐ కిషన్‌, ఏవో అడుప కవిత, ఎస్సై నర్సింహారావు, ఎస్‌బీ ఎస్సై చక్రధర్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యులు విత్తనాలు, ఎరువుల వివరాలను తెలుసుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని రాయపర్తిలో ఏవో గుమ్మడి వీరభద్రం, ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు, ఏఎస్సై మేకల లింగారెడ్డి, సిబ్బంది, ఏఈవోలు మనస్విని, ఉడుత సాయి, రాజేశ్‌, శిరీష, హిమబిందు రికార్డులు తనిఖీ చేసి, స్టాక్‌ వివరాలు పరిశీలించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఎస్సై రాజేశ్‌నా యక్‌, ఏఈవో మల్లేశం, బచ్చన్నపేటలో ఏవో అనిల్‌కుమా ర్‌, ఎస్సై రఘుపతి, లింగాలఘనపురంలో సీఐ బాలాజీ వరప్రసాద్‌, ఎస్సై రవీందర్‌, ఏవో జయంత్‌కుమార్‌ ఫర్టిలైజర్‌ షాపులను తనిఖీ చేశారు. స్టేషన్‌ఘన్‌ఫూర్‌ నియోజకవర్గంలోని చిలుపూర్‌ మండలం చిన్నపెండ్యాలలో ఎస్సై మహేందర్‌, ఏఎస్సై శ్రీనివాస్‌, మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు, దంతాలపల్లిలో డీఎస్పీ వెంకటరమణ, సీఐ చేరాలు, ఏవో లు కుమార్‌యాదవ్‌, జమున, మానస, ఎస్సైలు నగేశ్‌, వెంకన్న, రియాజ్‌పాషా, మున్నీరుల్లా, గంగారం మండలంలో మహబూబాబాద్‌ డీఎస్పీ నరేశ్‌, ఎస్సై రామారావు తనిఖీలు చేపట్టారు. భూపాలపల్లి జిల్లా రేగొండలో ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రం, ఎస్‌ఎస్‌ అగ్రిమాల్‌, లక్ష్మీ ఫర్టిలైజర్లను ఏవో వాసుదేవారెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ సీఐ మోహన్‌, ఎస్సై కృష్ణప్రసాద్‌గౌడ్‌, గణపురం మండలం చెల్పూర్‌ శ్రీనివాస ఫర్టిలైజర్‌ షాపులో ఏవో మాలోత్‌ సతీశ్‌, ఎస్సై రాజన్‌బాబు, టాస్క్‌ఫోర్స్‌ అధికారి గండ్రాతి మోహన్‌ తనిఖీ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఏవో సంతోశ్‌, ఎస్సై వెంకటమల్లు, కన్నాయిగూడెంలో ఏవో నర్సింహారావు, ఎస్సై సురే శ్‌, వాజేడు, మండపాక, చెరుకూరు, ధర్మవరం, పేరూరులో ఏవో వాజీద్‌ మహ్మద్‌, ఎస్సైలు తిరుపతిరావు, హరికృష్ణ, సీఆర్పీఎఫ్‌ డీఎస్పీ గణేశ్‌, ఏటూరునాగారంలో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి వ్యవసాయ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు.


logo