బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Jun 04, 2020 , 02:12:12

వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం

వైభవంగా  లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం

దామెర, జూన్‌ 3: మండలంలోని ఊరుగొండ గ్రామం లో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవితో కొలువై ఉన్న స్వామికి పంచామృతాలతో ఆలయ ప్రధాన అర్చకులు తూపురాణి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన చేశా రు. స్వామివారికి పట్టువస్ర్తాలను పీఏసీఎస్‌ చైర్మన్‌ బొల్లు రాజు, సునీత దంపతులతో పాటు లక్కిడి శ్రీనివాస్‌రెడ్డి దంపతులు, మల్లాడి రాజిరెడ్డి దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారు రుక్ష్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గోగుల సత్యనారాయణరెడ్డి, వైస్‌ ఎంపీపీ జాకీర్‌ అలీ, ఉపసర్పంచ్‌ విద్యాసాగర్‌, వార్డు సభ్యులు సందీప్‌రెడ్డి, ఒడిదోలు మల్లయ్య, పెండ్యాల మధుకర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ ఆరె వెంకట్‌రెడ్డి, సిలివేరు నర్సయ్య, మల్లాడి కృష్ణారెడ్డి,రామస్వామి పాల్గొన్నారు. 


logo