సోమవారం 13 జూలై 2020
Warangal-rural - Jun 01, 2020 , 04:07:51

పేదల సంక్షేమమే సీఎం ధ్యేయం

పేదల సంక్షేమమే సీఎం ధ్యేయం

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

రెడ్డికాలనీ, మే 31:  లాక్‌డౌన్‌ కష్టకాలంలో పేదల కోసం సీఎం కేసీఆర్‌ అ నేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ఆదివారం ఏనుగులగడ్డలో అభివృద్ధి పనులకు చీఫ్‌ విప్‌ శంకుస్థాపన చేశారు. నిరుపేదలకు అమృత గార్డెన్‌లో నిత్యావసర సరుకు లు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ 30వ డివిజన్‌ ఏనుగులగడ్డలో రూ.30 లక్షలతో రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ ప నులు ప్రారంభించినట్లు చెప్పారు. కాలనీలో ప్రజలకు మాస్కులు అందజే శా రు. అనంతరం రిటైర్డ్‌ పోలీస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీర గో వింద్‌ ఇంటికెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ బోడ డిన్నా, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అ ధ్యక్షుడు పేర్ల మనోహర్‌, నాయకులు చింతాకుల ప్రభాకర్‌, గోనె రాధిక, సాగ ర్‌, బాలబోయిన రాజు, రాధ, విశాల, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. logo