178 మంది ప్రయాణికులు హోం క్వారంటైన్

- శ్రామిక్ రైలులో 110 మంది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 68 మంది
- వరంగల్ స్టేషన్‌కు రాక..
- వివరాలు సేకరించిన అధికారులు
ఖిలావరంగల్, మే 27 : రైళ్ల ద్వారా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 178 మంది ప్రయాణికులను వరంగల్ తహసీల్దార్, నోడల్ అధికారి ఎండీ ఇక్బాల్ ఆధ్వర్యంలో హోం క్వారంటైన్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీధాం నుంచి శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌కు వెళ్లే శ్రామిక్ రైలు నుంచి మంగళవారం అర్ధరాత్రి వరంగల్ రైల్వేస్టేషన్లో 110 మంది ప్రయాణికులు దిగారు. ఇందులో తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన ప్రయాణికులున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ప్రయాణికుడి వివరాలు సేకరించి హోం క్వారంటైన్ ముద్ర వేశారు. అలాగే, బుధవారం చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్లే రాజధాని సూపర్‌ఫాస్ట్ రైలు (02433) ద్వారా వరంగల్‌కు 68 మంది ప్రయాణికులు వచ్చారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ ముద్ర వేశారు.
ఢిల్లీకి వెళ్లిన 19 మంది ప్రయాణికులు..
రాజధాని రైలులో వరంగల్ నుంచి న్యూఢిల్లీకి 19 మంది వెళ్లారు. వీరికి వరంగల్ రైల్వేస్టేషన్లో వైద్య పరీక్షలు నిర్వహించి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. వరంగల్ రైల్వేస్టేషన్ మేనేజర్ శ్రీనివాస్, సీటీఐ ఆర్బీ వెంకటేశ్వర్లు, సీసీఐ శ్రీనివాస్, ఆర్పీఎఫ్, జీఆర్పీ ఇన్స్పెక్టర్లు రవిబాబు, వినయ్‌కుమార్, నోడల్ అధికారి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్పందన డాక్టర్ మహేందర్, డాక్టర్ విజయ్‌కుమార్, జీకలర రమేశ్, కోర్నేలు, సంధ్య, డాక్టర్ శ్రీదేవి, భాగ్యలక్ష్మి, సబిత పాల్గొన్నారు.
తాజావార్తలు
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- ఒక్క రోజు సీఎంగా.. శ్రీష్టి గోస్వామి
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం
- ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
- గణతంత్ర దినోత్సవ అతిథులకు అభినందనలు : మంత్రి
- క్రికెట్ ఆడిన సీపీ సజ్జనార్
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
- 'గాలి సంపత్` విడుదల తేదీ ఖరారు
- రేగు పండు.. ఖనిజాలు మెండు..!