మంగళవారం 07 జూలై 2020
Warangal-rural - May 27, 2020 , 04:48:03

సర్కారు చెప్పిన పంటలే వేయాలి

సర్కారు చెప్పిన పంటలే వేయాలి

  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

నర్సింహులపేట/నెల్లికుదురు/సంగెం/పర్వతగిరి: సర్కారు చెప్పిన పంటలే రైతులు సాగు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. పలు మండలాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. నర్సింహులపేట మండలం బొజ్జన్నపేటలో బంధువుల ఇంటికి వచ్చిన అనంతరం ఉపాధి పనులు పరిశీలించారు. కూలీలకు మాస్కులు అందించారు. కూలీలకు రోజుకు రూ.200 వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాలన్నారు. నెల్లికుదురు మండలం మునిగలవీడులో మంత్రి పర్యటించారు. గ్రామపంచాయతీ నిర్వహణపై సూచనలు ఇచ్చారు. ఉపాధి పనులపై ఆరా తీశారు. మొక్కల పెంపకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. సంగెం మండలం కాపులకనపర్తి వద్ద రైతులతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. మిల్లర్లు, అధికారులతో మాట్లాడారు. వెంట ఉన్న రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతోనూ మాట్లాడించారు. నిర్ణీత పంటలే సాగు చేయాలని సూచించారు. రైతులకు మాస్కులు అందజేశారు. పర్వతగిరి మండలం దౌలత్‌నగర్‌ శివారు టూక్యా తండాలో ఉపాధి పనులను మంత్రి పరిశీలించారు. కూలీలకు మాస్కులు అందజేశారు. 


logo