శనివారం 11 జూలై 2020
Warangal-rural - May 25, 2020 , 02:49:26

ఆరోగ్యానికి.. పది నిమిషాలు

ఆరోగ్యానికి.. పది నిమిషాలు

ప్రతి ఆదివారం తప్పనిసరిగా పని చేయాలి

ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

రూరల్‌కలెక్టరేట్‌, మహబూబాబాద్‌ : మంత్రి కేటీఆర్‌ పిలుపులో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు పదినిమిషాల పాటు వరంగల్‌ రూరల్‌, మానుకోట కలెక్టర్లు పరిశుభ్రత ప నులు చేపట్టారు. రూర ల్‌ కలెక్టర్‌ హరిత క్యాం ప్‌ కార్యాలయంలో ఉన్న మొక్కల కుండీల్లోని నీటిని తీసి డ్రైగా ఉంచారు. అదనపు కలెక్టర్‌ సైతం క్యాంప్‌ కార్యాలయంలో కూలర్‌లోని నీటిని తొలగించారు. మానుకోట కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆర్డీవో కార్యాలయంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. సిబ్బందితో కలిసి కార్యాలయంలో వృథాగా పడి ఉన్న వస్తువులను తొలగించారు.    

 


logo