మంగళవారం 26 మే 2020
Warangal-rural - May 24, 2020 , 03:10:41

అక్షితకు ఎమ్మెల్సీ పోచంపల్లి చేయూత

అక్షితకు ఎమ్మెల్సీ పోచంపల్లి చేయూత

మంగపేట: మండలంలోని మల్లూరుకు చెందిన జనగాని శోభన్‌ ఆరేళ్ల కూతు రు అక్షిత పేగుకు రంధ్రం పడి శస్త్ర చికిత్స చేయించుకునే ఆర్థిక స్థోమత లేని విష యాన్ని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి వై సతీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పో చంపల్లి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన శనివారం సతీశ్‌రెడ్డిని మల్లూరుకు పంపి, అక్షిత ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలుసుకున్నారు. అక్షిత వైద్యం కోసం రూ.3 లక్షలు ఖర్చు అయ్యాయని, మరో వైపు బాలిక తండ్రి శోభన్‌ కూడా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాలను గుర్తించారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి సహకారంతో అక్షితకు అవసరమైన సత్వర వైద్య సహాయం అందిస్తామని ఆయన శోభన్‌ కుటుంబానికి హామీ ఇచ్చారు.logo