మంగళవారం 26 మే 2020
Warangal-rural - May 24, 2020 , 03:09:29

పేదల ఆరాధ్యుడు సీఎం కేసీఆర్‌

పేదల ఆరాధ్యుడు సీఎం కేసీఆర్‌

డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

మరిపెడ : పేదల ఆరాధ్యుడు సీఎం కేసీఆర్‌ అని డోర్నకల్‌ ఎమ్మెల్యే ధరంసోత్‌ రెడ్యానాయక్‌ అన్నారు. శనివారం మరిపెడ తహసీల్దార్‌ కార్యాలయంలో 219 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో సుమారు 1200 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందాల్సి ఉండగా 219 మందికి రూ. 2.15కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు. మిగిలిన వారికి కొద్ది రోజుల్లోనే అందేలా అధికారులు చూడాలన్నారు. రూ.25వేలలోపు రైతుల రు ణాలను మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్ధి పనులపై పలు శాఖల అధికారులతో సమీక్షించారు. నర్సరీలు, డంపింగ్‌యార్డ్‌, శ్మశానవాటిక నిర్మాణ పనుల ప్ర గతిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. జూన్‌ 30లోపు పల్లె ప్రగతి పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నవీన్‌, ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ శారద, పీఏసీఎస్‌ చైర్మన్‌ యాదగిరిరెడ్డి, తహసీల్దార్‌ రాఘవరెడ్డి, వైస్‌ ఎంపీపీ అశోక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకన్న, మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రఘు, ఎంపీడీవో కు మార్‌, ఎంపీవో పద్మ, ఏపీవో మంగమ్మ, ఏఈ శ్రీనివాస్‌నాయక్‌ పాల్గొన్నారు.


logo