మంగళవారం 26 మే 2020
Warangal-rural - May 22, 2020 , 02:40:38

సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ

సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ

మంత్రి కేటీఆర్‌కు చెక్కుల అందజేత

వరంగల్‌/నయీంనగర్‌ : కరోనా విపత్తు నివారణకు తమ వంతు సాయంగా వరంగల్‌లోని వివిధ సంఘాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, గోల్డ్‌ మర్చంట్‌ అసోసియేషన్‌, పెరుక సంఘం ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందజేశారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్కులు అందజేశారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, కోశాధికారి కిశోర్‌ రూ. 20.11 లక్షల చెక్కు, వరంగల్‌ జిల్లా పెరుక సంఘం బాధ్యులు రూ. 6 లక్షలు, వరంగల్‌ గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ తరఫున ఎమ్మెల్యే నన్నపునేని రూ. 50 వేల చెక్కును మంత్రికి అందజేశారు. అలాగే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ సిబ్బంది ఇచ్చిన  రూ. 2.20 లక్షల చెక్కును చీఫ్‌విప్‌ దాస్యం మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా సంఘాల బాధ్యులను అభినందించారు.


logo