శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - May 21, 2020 , 02:47:44

కరోనా కట్టడికి స్మార్ట్‌ అలర్ట్‌..!

కరోనా కట్టడికి స్మార్ట్‌ అలర్ట్‌..!

ఐనవోలు: కరోనా వ్యాప్తికి చేతులే వాహకంగా పనిచేస్తున్నాయని గ్రహించిన వ రంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన యువకుడు యాకర గణేశ్‌ చేతికి ధరించే స్మార్ట్‌ అలర్ట్‌, హ్యాండ్‌ ఫ్రీ శానిటైజర్‌ను తయారు చేశాడు. చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతుందని గుర్తించి, కరోనా కట్టడిలో తనవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఆయా పరికరాలను ఆవిష్కరించాడు.  ‘స్మార్ట్‌ అలర్ట్‌' పరికరం చేతికి ధరించాల్సి ఉంటుంది. అ నుకోకుండా చేతులు ముఖం దగ్గరగా వెళ్తే ఈ పరికరం సైరన్‌ ఇస్తుంది. దీంతో ముఖాన్ని చేతులతో తాకకుండా జాగ్రత్త పడే వీలుంటుంది. ఈ పరికరం ధరించిన వ్యక్తి వద్దకు ఇతరులు వస్తే సైరన్‌ వస్తుంది. వైద్య సిబ్బంది, మున్సిపల్‌ కార్మికులు, ప్రజలకు ఉపయోగపడేలా సెన్సార్‌ సాయంతో పని చేసేలా ‘హ్యాండ్‌ ఫ్రీ శానిటైజర్‌'ను గణేశ్‌ తయారు చేశాడు. దీని పనితీరును వీడియో తీసి వరంగల్‌ కిట్స్‌ కళాశాల అధ్యాపకుడు విజయ్‌కుమార్‌ ద్వారా మహబూబాబాద్‌ కలెక్టర్‌ వీపీ గౌతమ్‌కు పంపించారు. దీనికి స్పందించిన కలెక్టర్‌ గౌతమ్‌ గణేశ్‌ను మహబూబాబాద్‌కు మంగళవారం ఆహ్వానించి శానిటైజర్‌ పనితీరును పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ ఇంద్రసేనారెడ్డి గణేశ్‌తో మాట్లాడి, టెస్టింగ్‌ కోసం 4శానిటైజర్లు తెప్పించాలని సూచించారు. ప్రయోగం విజయవంతం అయితే మరో 100శానిటైజర్లు అర్డర్‌ చేస్తామని హామీ ఇచ్చిన ట్లు ఆ యువకుడు పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం చేయూతనందిస్తే తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులోకి పరికరాలు తీసుకు వస్తానని గణేశ్‌ చెప్పాడు.logo