మరో నెల వరకు కొనుగోళ్లు

- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట రూరల్/నెక్కొండ/చెన్నారావుపేట, మే14: ఆలస్యంగా పంట చేతికి వచ్చిన రైతులు అధైర్య పడొద్దని, మరో నెల వరకు కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో నిర్వహిస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ హరిత తెలిపారు. నర్సంపేటలోని ఎంఏఆర్ ఫంక్షన్ హాల్లో జేసీ మహేందర్‌రెడ్డితో కలిసి వరి, మక్కల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తరలించేలా అవగా హన కల్పించాలని కోరారు. నెక్కొండ ఆర్యూబీని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పది రోజుల్లో ప్రజలకు అంకితం చేస్తామని పేర్కొన్నారు. నెక్కొండ మండలం తోపనపల్లి, చెన్నారావుపేట మండలం ఎల్లాయగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెద్ది ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీఏ తోట శ్రీనివాసరావు, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, జెడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ నబీ, ఎంపీపీ రమేశ్, సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, ఘంటా ధర్మారెడ్డి, ముద్దసాని సత్యనారాయణరెడ్డి, మురహరి రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, బాల్నె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- గండిపేటకు పర్యాటక సొబగులు..డిజైన్ రెడీ
- హర్భజన్‌ను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- కోల్డ్ స్టోరేజ్‌లో1,000 కొవిషీల్డ్ డోసులు ధ్వంసం
- ఆర్మీ యూనిఫాంలో రైతు నిరసనల్లో పాల్గొనవద్దు..
- రిషబ్ పంత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్
- 60 దేశాల్లో యూకే కరోనా వేరియంట్..
- మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!
- సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం : ఐఎండీ
- లక్కీ ఛాన్స్ కొట్టేసిన థమన్