పేదలకు అండగా ప్రభుత్వం

- చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
నయీంనగర్/నక్కలగుట్ట/న్యూశాయంపేట, మే 14 : కరోనా నేపథ్యంలో పేద ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అండగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 46 డివిజన్ సమయ్యనగర్లోని ప్రభుత్వ పాఠశాలలో పేదలకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆయన పంపిణీ చేశారు. అలాగే, 47, 48 డివిజన్లలో కార్పొరేటర్లు నల్లా స్వరూపరాణి రెడ్డి, బోయినపల్లి రంజిత్‌రావు ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మంది నిరుపేదలకు కూడా సరుకులు పంపిణీ చేశారు. 32వ డివిజన్ హంటర్‌రోడ్‌లోని కల్వరి టెంపుల్లో డాక్టర్ సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో 250 మంది పాస్టర్లకు నిత్యావసర సరుకులను వినయ్‌భాస్కర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే కరోనా వైరస్ రాష్ట్రంలో తక్కువగా ఉందన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో నియోజకవర్గంలో ఫీడ్ ది నీడ్ కార్యక్రమం చేపట్టి 20 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రియాదవరెడ్డి, రైతురుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ సునీల్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు బైరి వెంకట్రాజం, సబితారెడ్డి, కుడా డైరెక్టర్ మాడిశెట్టి శివశంకర్, రాజేంద్రప్రసాద్, ఏసీపీ బాబురావు, పులి శ్రీనివాస్, జైరాజ్, సుధాకర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు