ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - May 14, 2020 , 02:45:38

వ్యవసాయ క్షేత్రంలో మంత్రి ఎర్రబెల్లి

వ్యవసాయ క్షేత్రంలో మంత్రి ఎర్రబెల్లి

పర్వతగిరి : ప్రజాసేవలో నిత్యం బిజీ బిజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్వతగిరి మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్షేత్రాన్ని బుధవారం సందర్శించారు. క్షేత్రంలో సాగుచేసిన పంటలను పరిశీలించారు. వ్యవసాయ పనులు చేసే కూలీలకు పంటలకు సంబంధించి పలు సూచనలు చేశారు. మామిడి తోటలోని పండ్లను, పనసకాయలను చూసి కొద్ది సేపు సేదదీరారు.