శనివారం 23 జనవరి 2021
Warangal-rural - May 13, 2020 , 02:47:06

లేనోళ్లకు సాయం చేయాలె

లేనోళ్లకు సాయం చేయాలె

పాలకుర్తి రూరల్‌/ రాయపర్తి : కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయ వనరులు పూర్తిగా దెబ్బతిన్నా ప్రజల ప్రాణాలే ప్రధానమని భావించిన సీఎం కేసీఆర్‌ పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంతో పాటు ఎల్లరాయిని తొర్రూరు, రాయపర్తి మండలంలోని కొండూ రు, గన్నారం గ్రామాల సర్పంచ్‌లు కర్ర సరిత, రవీందర్‌రెడ్డి, కుక్కల భాస్కర్‌, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డితో పాటు ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌, పలువురు దాతల సహకా రంతో ఆయా గ్రామాల్లో నిరుపేదలకు, పాలకుర్తిలో ట్రస్ట్‌తో పాటు మార్గం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కుల వృత్తిదారులు, నాయీ, విశ్వబ్రాహ్మణ, పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని పేదలు ప్రస్తుత కష్టకాలంలో కడుపు మాడ్చుకోవద్దనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తికీ 12 కిలోల ఉచిత బియ్యంతో పాటు ప్రతి కార్డుదారుడికి రూ.1500 అందజేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ రైతులకు న్యాయం చేస్తున్నట్లు తెలిపారు.  స్వీయ నియంత్రణతోనే కరోనాను కట్టడి చేయొచ్చని సూచించారు.  కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్‌, జెడ్పీటీసీ రంగు కుమార్‌, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, నాయిని మల్లారెడ్డి, మార్గం సాయి సందీప్‌ తేజ, గోనె మైసిరెడ్డి, కల్వల భాస్కర్‌రెడ్డి, బొబ్బల ఆశోక్‌రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు మునావత్‌ నర్సింహనాయక్‌, జిల్లా నాయకులు బిల్ల సుధీర్‌రెడ్డి, ఎంపీటీసీ చిర్ర ఉపేంద్ర, జక్కుల వెంకట్‌రెడ్డి, పూస మధు, గుండె రామస్వామి, తహసీల్దార్‌ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో కలికోట రామ్మోహనాచారి, ఎంఈవో నోముల రంగయ్య, శ్యాంరావు, గుండె బాబు పాల్గొన్నారు. 


logo