బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - May 12, 2020 , 01:41:29

హోం క్వారంటైన్‌లో 99 మంది

హోం క్వారంటైన్‌లో 99 మంది

  • అర్బన్‌ జిల్లాలో ఐదుగురు 
  • జనగామలో 13 మంది
  • మానుకోటలో 81 మందికి కౌన్సెలింగ్‌ 
  • వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించిన అధికారులు
  •  15 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని  సూచన
  • అజ్మీర్‌ షరీఫ్‌ దర్గా యాత్రికులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం 99 మందిని హోం క్వారంటైన్‌కు తరలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  లాక్‌ డౌన్‌లో సడలింపు ఇవ్వగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారంతా సొంత గ్రామాలకు వస్తున్నారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఇచ్చే సమాచారంతో అధికారులు వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. 15 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అంతేకాదు మణికట్టుపై హోం క్వారంటైన్‌ ముద్ర వేశారు. 

ఖిలావరంగల్‌: ఖిలావరంగల్‌ మధ్యకోటకు చెందిన  ఓ కుటుంబంలోని  ఐదుగురు లాక్‌డౌన్‌కు ముందు రాజస్థాన్‌లోని అజ్మీర్‌ షరీఫ్‌ దర్గా దర్శనానికి వెళ్లారు. తిరిగి రావడానికి రవాణా వ్యవస్థ లేకపోవడంతో 50 రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. కాగా ఇటీవల ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ సడలించడంతో ఆదివా రం రాత్రి వారు మధ్యకోటకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఖిలావరంగల్‌ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో  ఉండాలంటూ చేతులపై ముద్ర వేశారు. 

ఏడు కుటుంబాల్లోని13 మంది 

బచ్చన్నపేట: ముంబై నుంచి మండలంలోని కొన్నెకు వచ్చిన ఏడు కుటుంబాలు 15 రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎస్సై రఘుపతి సూచించారు. సోమవారం గ్రా మాన్ని సందర్శించి కౌన్సెలింగ్‌ ఇ చ్చారు.  వారి వెంట పీఏసీఎస్‌ డైరెక్టర్‌ లక్ష్మ ణ్‌, ఏఎన్‌ఎం పద్మావతి, సిద్దిరాములు ఉన్నారు.

81 మంది  హోం క్వారంటైన్‌ 

తొర్రూరు/దంతాలపల్లి: లాక్‌డౌన్‌ సడలింపుతో మహారాష్ట్ర, ముంబై, ఇతర రాష్ర్టాల నుంచి తొర్రూరు, దంతాలపల్లి పెద్దముప్పారం, దాట్ల గ్రామాలకు 81 మంది వలస కార్మికులు వచ్చారు. విషయం తెలిసిన వెంటనే వీరిని తహసీల్దార్లు రమేశ్‌బాబు, గౌరీశంకర్‌, ఎస్సై నగేశ్‌, ఎమ్మారై భాస్కర్‌, వైద్యాధికారులు సతీశ్‌, వేదకిరణ్‌, భరత్‌ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్సను అందించి, స్టాంపింగ్‌ వేసి 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కాగా, మరో వారం రోజుల్లో 800 మంది బుడగ జంగాలు మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి తొర్రూరు, కంఠాయపాలెం, అమ్మాపురం, మడిపెల్లి గ్రామాలకు  రానున్నారని వారు తెలిపారు.  

ఇతర రాష్ర్టాల నుంచి వస్తే.. హోంక్వారంటైన్‌ చేయాలి

రెడ్డికాలనీ : లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చేవారిని గుర్తించి హోంక్వారంటైన్‌ చేయాలని వైద్యాధికారులను డీఎంహెచ్‌వో కే లలితాదేవి ఆదేశించారు. సోమవారం వరంగల్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్యాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాకు ప్రస్తుతం 326 మంది వివిధ రాష్ర్టాల నుంచి వచ్చారన్నారు. కలెక్టర్‌ ద్వారా వస్తున్న జాబితాతో పాటు, ఇంకా ఎవరైనా వచ్చినట్లయితే వారందరినీ గుర్తించి స్టాంపింగ్‌ చేసి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ సంబంధిత  ఆశ, ఏఎన్‌ఎంలు సందర్శించి వారిలో  ఏమైనా లక్షణాలు కనిపిస్తే తెలియజేయాలన్నారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ టీ మదన్మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎండీ యాకూబ్‌పాషా, డీఐవో  గీతాలక్ష్మి, పీవోఎన్‌సీడీ ఉమశ్రీ, డీటీసీవో డాక్టర్‌మల్లికార్జున్‌, డీఎంవో వాణిశ్రీ, డీఈఎంవో వేముల అశోక్‌రెడ్డి , సీహెచ్‌వో టీ మాధవరెడ్డి పాల్గొన్నారు.


logo