బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - May 12, 2020 , 01:41:42

పేద ప్రజల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం

పేద ప్రజల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం

  • ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

మడికొండ, మే 11 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల ఆకలి తీరుస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. రాంపూర్‌లో ఎన్‌ఆర్‌ఐ మిత్రమండలి ఆధ్వర్యంలో సోమవారం ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొవిడ్‌-19 నియంత్రణకు సీఎం కేసీఆర్‌ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌, తక్కళ్లపల్లి రాంగోపాల్‌రావు, దేవేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


logo