సోమవారం 13 జూలై 2020
Warangal-rural - May 10, 2020 , 02:39:40

ఇబ్బందులున్నా హామీలు అమలు

ఇబ్బందులున్నా హామీలు అమలు

  • వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట/హసన్‌పర్తి/సుబేదారి/ఐనవోలు/కాశీబుగ్గ : కరోనా మహమ్మారితో పా టు ఆర్థికమాంద్యం వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. శనివారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి వర్ధన్నపేటలో డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఆయన క్షీరాభిషేకం చేశా రు. అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి పీఏసీఎస్‌ గోదాం ఆవరణలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బిల్లా ఉద య్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఐనవోలు మండలం పంథినిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు పరిశీలించారు. కరోనా బాధిత కుటుంబాల కోసం గ్రేటర్‌ 12వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ముడుసు నర్సింహ రూ.10వేల చె క్కును ఎమ్మెల్యేకు అందజేశారు. డీసీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట కేసీఆర్‌ చిత్ర పటానికి పాలకవర్గం క్షీరాభిషేకం చేసింది. కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్‌చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, డైరె క్టర్లు కంది శ్రీనివాస్‌రెడ్డి, గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రావు, కార్పొరేటర్‌ ఝా న్సీలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అరుణ, జెడ్పీటీసీ భిక్షపతి, ఎంపీపీ అప్పారావు పాల్గొన్నారు. 


logo