శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - May 09, 2020 , 02:48:53

కష్టసుఖాల్లో అండగా ఉంటా

కష్టసుఖాల్లో అండగా ఉంటా

  • వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

మడికొండ, మే 08 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు కష్ట సుఖాల్లో అండగా ఉంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. మడికొండలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో అరూరి గట్టుమల్లు ఫౌండేషన్‌ ద్వారా ఆటోడ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు శుక్రవారం పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్‌ ఆవాల రాధికారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేదలను ఆదుకునే బాధ్యత తనపై ఉందన్నారు. విపత్కర పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్‌ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం పలువురు అరూరి గట్టుమల్లు ఫౌండేషన్‌కు విరాళాలు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఇండ్ల నాగేశ్వర్‌రావు, కొమురయ్య, నర్సింగరావు, మోహన్‌, రామ్మూర్తి, నవీన్‌, దేవేందర్‌, వినోద్‌, మాచర్ల శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo