శనివారం 16 జనవరి 2021
Warangal-rural - May 09, 2020 , 02:48:54

మక్క రైతుల తిప్పలకు చెక్‌

మక్క రైతుల తిప్పలకు చెక్‌

  • పౌల్ట్రీ పరిశ్రమకు సీఎం కేసీఆర్‌ చేయూత: పెద్ది

నెక్కొండ, మే08: పౌల్ట్రీ పరిశ్రమకు సీఎం కేసీఆర్‌ చేయూతనిస్తూ మక్కల రైతుల ఇబ్బందులకు చెక్‌ పెట్టారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నెక్కొండ మండలం పెద్దకొర్పోలు, వాగ్యా నాయక్‌ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పౌల్ట్రీ యాజమాన్యాలే నేరుగా కొనుగోలు కేంద్రాల నుంచి మక్కలను తీసుకెళ్లే ఏర్పాట్లు చేశారని అన్నారు. రేపటి వరకు కార్యాచరణ సిద్ధమవుతుందని పేర్కొన్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో దాదాపు 10 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారని, ఇండస్ట్రీని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారన్నారు. రైతుల నుంచి క్వింటాలుకు రూ. 1760కు కొనుగోలు చేసిన మక్కలను ప్రభుత్వం పౌల్ట్రీ పరిశ్రమకు రూ.1525కే విక్రయిస్తుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సరోజన,  కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌నబీ, ఎంపీపీ రమేశ్‌, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్‌రావు, పెద్ద కొర్పోలు, వాగ్యానాయక్‌ తండా సర్పంచ్‌లు మహబూబ్‌ పాషా, హరికిషన్‌, ఏడీఏ శ్రీనివాసరావు,  వైస్‌ చైర్మన్‌ వెంకన్న, ఏవో సంపత్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.