గురువారం 28 జనవరి 2021
Warangal-rural - May 07, 2020 , 02:22:50

రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి

రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి

నెక్కొండ/చెన్నారావుపేట, మే 06 :  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం అత్యధిక దిగుబడి 38లక్షల టన్నులైతే.. స్వరాష్ట్రంలో యాసంగిలో కోటి మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాధించి తెలంగాణ రికార్డు సృష్టించిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రైతులకు అన్నంపెట్టేది సీఎం కేసీఆర్‌ అయితే సున్నం పెట్టేది ప్రతిపక్షాలని విమర్శించారు. బుధవారం నెక్కొండ మండల కేంద్రంతోపాటు మండలంలోని నాగారం,  చెన్నారావుపేట  మండలంలోని తిమ్మరాయిన్‌పహాడ్‌లో  ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ప్రారంభించి మాట్లాడారు.   కార్యక్రమాల్లో మారం రాము, జలగం సంపత్‌రావు, ఘంటా ధర్మారెడ్డి, రమేశ్‌, తోట శ్రీనివాసరావు, బాదావత్‌ విజేందర్‌, బానోతు పత్తినాయక్‌, బాల్నె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


logo