గురువారం 06 ఆగస్టు 2020
Warangal-rural - May 06, 2020 , 01:15:28

జాగృతి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

జాగృతి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

హన్మకొండ నమస్తే తెలంగాణ : లక్ష మాస్కులు పంపిణీ చేయాలనే జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు మంగళవారం జాగృతి యువత అధ్యక్షుడు విజయ్‌కుమార్‌  ఆధ్వర్యంలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు, సీపీ రవీందర్‌కు మూడు వేల మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బండారి సుమన్‌, రాష్ట్ర నాయకుడు బొంపెల్లి సోమేశ్వర్‌రావు, రోహిత్‌, రమేశ్‌,  శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ములుగులో..

ములుగు, నమస్తేతెలంగాణ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు లక్ష మాస్కుల పంపిణీలో భాగంగా జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ పోరిక రవీందర్‌నాయక్‌ మంగళవారం ఏఎస్పీ సాయిచైతన్యకు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌కు మాస్కులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువత అధ్యక్షుడు శివశంకర్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు కుమార్‌పాడ్యా, మీడియా ఇన్‌చార్జి నాజర్‌ఖాన్‌, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo