మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - May 06, 2020 , 01:15:30

కరోనాపై యుద్ధంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

కరోనాపై యుద్ధంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

  • మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

నక్కలగుట్ట, మే 05 : కరోనా నియంత్రణ కోసం చేస్తున్న యుద్ధంలో జర్నలిస్టుల పాత్ర  కీలకమని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హంటర్‌రోడ్‌లోని నేత హాస్టల్‌ భవన్‌లో పద్మశాలి జర్నలిస్టుల పరపతి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయగా, కడియం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా వైరస్‌ నియంత్రణలో సమాజాన్ని చైతన్యం చేయడంలో జర్నలిస్టులు ఆహోరాత్రులు శ్రమిస్తున్నారన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న విలేకరులు నిత్యం జరుగుతున్న పరిణామాలను ప్రజల వద్దకు తీసుకపోతున్నారని కొనియాడారు. విపత్కర కాలంలో పరపతి సంఘం తమ సభ్యులకు సాయం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు, డాక్టర్లు పోతాని రాజేశ్వరప్రసాద్‌, రమేశ్‌, పరపతి సంఘం అధ్యక్షుడు వేముల నాగరాజు, వేముల సదానందం, గడ్డం కేశవ మూర్తి, వల్లాల వెంకటరమణ, వెల్దండి రమేశ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.